గెలిచిన ఒక్క ఎమ్మెల్యేనూ పట్టించుకోని పవన్!

ముఖ్యమంత్రి కావాలనుకుంటే అది తనకు పెద్ద విషయం కాదని చెప్పిన పవన్ కల్యాణ్ ఆఖరికి ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయారు. ఒకటికి రెండుచోట్ల పోటీచేసి రెండుచోట్లా ఆయన ఓడిపోయారు. జనసేన తరఫున రాష్ట్రవ్యాప్తంగా గెలిచింది ఒకే ఒక్కడు!…

ముఖ్యమంత్రి కావాలనుకుంటే అది తనకు పెద్ద విషయం కాదని చెప్పిన పవన్ కల్యాణ్ ఆఖరికి ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయారు. ఒకటికి రెండుచోట్ల పోటీచేసి రెండుచోట్లా ఆయన ఓడిపోయారు. జనసేన తరఫున రాష్ట్రవ్యాప్తంగా గెలిచింది ఒకే ఒక్కడు!

ఒకే ఒక్క ఎమ్మెల్యే జనసేన పార్టీ తరఫున నెగ్గి అసెంబ్లీలోకి ఎంటరయ్యారు. ఆయన తీరు ఇప్పటికే జనసైనికులకు ఏమాత్రం నచ్చడంలేదని తేలిపోయింది. బహుశా పవన్ కల్యాణ్ కు కూడా ఆయన తీరు అంతగా నచ్చినట్టుగా లేదు. అందుకే ఆయనకు పొలిట్ బ్యూరోలో స్థానమే ఇవ్వలేదు!

తాజాగా అనౌన్స్ చేసిన జనసేన పొలిట్ బ్యూరో లో రాపాక వరప్రసాద్ కు స్థానం దక్కపోవడం గమనార్హం. నాదెండ్ల మనోహర్, రామ్మోహన్ రావు, రాజు రవితేజ, అర్హాంఖాన్ లకు పొలిట్ బ్యూరోలో స్థానం దక్కగా, రాపాకకు మాత్రం అందులో స్థానం కల్పించలేదు.

ఏ పార్టీ అయినా పొలిట్ బ్యూరోలో కీలక నేతలకు స్థానం కల్పిస్తుంది. జనసేన కోణం నుంచి చూస్తే ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నెగ్గిన ఏకైకవ్యక్తి రాపాక. అయినప్పటికీ ఆయనకు పొలిట్ బ్యూరోలో స్థానం దక్కకపోవడం గమనార్హం.

ఇక ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయిన నాదెండ్లకు మాత్రం పొలిట్ బ్యూరోలో స్థానం దక్కింది. అలాగే ఆయనను పొలిటిక్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ ను కూడా చేశారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో మాత్రం రాపాకకు స్థానం దక్కింది. ఆయనతో పాటు నాగబాబు తదితరులు అందులో సభ్యులుగా ఉన్నారు. 

డియర్ కామ్రేడ్.. విజయ్ జోక్యం నిజంగా ఉందా?

సినిమా రివ్యూ: డియర్‌ కామ్రేడ్‌