బన్నీ అంటే డ్యాన్స్ లకు పెట్టింది పేరు అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అలాగే తనకంటూ ప్రతి సినిమాకు ఓ స్టయిల్ ను తయారుచేసుకుని, పాటల్లో కూడా దాన్ని చూపించడం బన్నీకి అలవాటు.
రాబోయే 'అల వైకుంఠపురములో' సినిమా కోసం బన్నీ అందిస్తున్న 'రాములో రాముల' పాట ఎంత పాపులర్ అన్న సంగతీ తెలిసిందే. ఆ పాటలో బన్నీ చేసిన 'హాఫ్ కోట్' డ్యాన్స్ బిట్ బాగా వైరల్ అయింది. ఇదే స్టెప్ ను బన్నీ కూతురు 'దోశ స్టెప్' అంటూ విడియో కట్ చేసిన సంగతీ తెలిసిందే.
ఇంతకీ ఇప్పుడు విషయం ఏమిటంటే, బన్నీ ఈ పాటకు చేసిన డ్యాన్స్ ను లైవ్ లో చూసే అవకాశం ఫ్యాన్స్ కు వచ్చింది. 6న హైదరాబాద్ లో జరిగే అలవైకుంఠపురములో మ్యూజికల్ ఫెస్టివల్ లైవ్ లో వేదిక మీద బన్నీ ఈ పాటకు డ్యాన్స్ చేయబోతున్నారు.
ఈ మ్యూజిక్ ఫెస్టివల్ లో చాలా అట్రాక్షన్లు వున్నా, బన్నీ డ్యాన్స్ కన్నా అట్రాక్షన్ ఇంకేం వుంటుంది. సిద్దూ శ్రీరామ్, అలాగే పలువురు ఫేమస్ సింగర్స్ పాటలు పాడడం కూడా అట్రాక్షన్లే. థమన్, శివమణి లాంటి మ్యూజిషియన్ల పెర్ ఫార్మెన్స్ అడిషనల్ అట్రాక్షన్.