మహేష్, బన్నీ: తెలిసి తప్పుచేస్తున్నారా..?

ఒకే సినిమాను 2 భాషల్లో తీయడం ఎంత కష్టమో విడమర్చి మరీ చెప్పాడు మహేష్. ఆ బాధ పగవాడికి కూడా వద్దనే రేంజ్ లో మాట్లాడాడు. జీవితంలో మరోసారి అలాంటి ప్రయోగం చేయనని కూడా…

ఒకే సినిమాను 2 భాషల్లో తీయడం ఎంత కష్టమో విడమర్చి మరీ చెప్పాడు మహేష్. ఆ బాధ పగవాడికి కూడా వద్దనే రేంజ్ లో మాట్లాడాడు. జీవితంలో మరోసారి అలాంటి ప్రయోగం చేయనని కూడా తేల్చేశాడు. నిజానికి స్పైడర్ సినిమా రిజల్ట్ తేడాకొట్టడానికి ఇలా 2 భాషల్లో ఒకేసారి తీయడం కూడా ఓ కారణమని పరోక్షంగా చెప్పుకొచ్చాడు. కళ్లముందు కొండంత ఎగ్జాంపుల్ పెట్టుకొని కూడా బన్నీ ఇప్పుడు మహేష్ దారిలోకి అడుగుపెడుతున్నాడు. 

అవును.. బన్నీ కూడా తమిళ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వచ్చే ఏడాది మార్చి నుంచి లింగుస్వామి దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి షూట్ చేయబోతున్నారు ఈ సినిమాని. అలా విక్రమ్ కుమార్ కంటే ముందు లింగుస్వామి సినిమానే స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు బన్నీ.

నిజానికి మహేష్ కంటే ముందే బన్నీ కోలీవుడ్ ఎంట్రీ జరగాల్సింది. వక్కంతం వంశీకి ఛాన్స్ ఇవ్వడంతో తమిళ ఎంట్రీ కాస్త ఆలస్యమైంది. కాకపోతే ఇప్పుడు బన్నీ కళ్లముందు స్పైడర్ ఉంది. ఆ సినిమా రిజల్ట్ చూసి కూడా 2 భాషల్లో సినిమా చేయడానికి బన్నీ రెడీ అవుతున్నాడంటే నిజంగా సాహసమనే చెప్పాలి. 

స్పైడర్ సినిమా టైపులోనే బన్నీ-లింగుస్వామి సినిమాలో కూడా ఆర్టిస్టులు మారతారట. కథ ప్రకారం కొన్ని సన్నివేశాలతో పాటు లొకేషన్లు కూడా మారతాయట. స్పైడర్ లా భారీ బడ్జెట్ కు పోకుండా.. టైట్ బడ్జెట్ లో సినిమా తీసి 2 భాషల్లో రిలీజ్ చేస్తే లాభాలు వాటంతట అవే వస్తాయి.

కాకపోతే ఈ విషయం బన్నీపై ఆధారపడి ఉంటుంది. బన్నీకి ఎలాగూ మలయాళం ఇండస్ట్రీ నుంచి అడ్వాంటేజ్ ఉంది కాబట్టి బడ్జెట్ హద్దులు దాటకుండా చూసుకుంటే చాలు.