మరో 3 రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు సమంత-నాగచైతన్య. గోవాలోని ఓ బడా రిసార్ట్ లో ఈ శుక్రవారం క్రిస్టియన్ పద్ధతిలో వీళ్లిద్దరూ ఒకటి కాబోతున్నారు. శనివారం హిందు సంప్రదాయంలో మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ పెళ్లికి దాదాపు 150మంది అతిథుల్ని ఆహ్వానించారు. వీళ్లలో ఎన్టీఆర్ కూడా ఒకడు.
అయితే సమంత-నాగచైతన్య పెళ్లికి ఎన్టీఆర్ వెళ్లకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఆహ్వానం అయితే అందింది కానీ, అప్పటికే ఫిక్స్ చేసుకున్న హాలిడే ట్రిప్ కారణంగా ఈ వివాహానికి ఎన్టీఆర్ హాజరయ్యే అవకాశాలు తక్కువని తెలుస్తోంది. తన కుటుంబ సభ్యులతో కలిసి యూరోప్ ట్రిప్ ప్లాన్ చేశాడు తారక్.
పెళ్లి సింపుల్ గానే చేసుకుంటున్నామని చెప్పినప్పటికీ ఈ ఖర్చు దాదాపు 10కోట్ల రూపాయలు అవుతోందట. అతిథులందరికీ విమాన టిక్కెట్ల నుంచి సకల మర్యాదల వరకు అన్నింటినీ అక్కినేని కుటుంబమే భరిస్తోందట. సో.. అతిథులంతా ఇలా వెళ్లి అలా ఆశీర్వదించి రావడమే. పెళ్లి తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటుచేస్తారు.