బన్నీ అంత ధైర్యం చేస్తాడా?

సేఫ్‌ జర్నీ చేయడం మన కథానాయకులకు అలవాటైపోయింది. ఓ హిట్టున్న దర్శకుడిని పట్టుకోవడం, వాణిజ్య అంశాలకు అనుగుణంగా కథలు రాసుకోవడం, బరిలోకి దిగిపోవడం ` బస్‌.. ఓ పైసా వసూల్‌ సినిమా చేస్తే చాలు.…

సేఫ్‌ జర్నీ చేయడం మన కథానాయకులకు అలవాటైపోయింది. ఓ హిట్టున్న దర్శకుడిని పట్టుకోవడం, వాణిజ్య అంశాలకు అనుగుణంగా కథలు రాసుకోవడం, బరిలోకి దిగిపోవడం ` బస్‌.. ఓ పైసా వసూల్‌ సినిమా చేస్తే చాలు. అందుకే ఓ హిట్టు పడిన దర్శకుడి చుట్టూ చేరి అడ్వాన్సులు పెట్టించేస్తుంటారు. హరీష్‌ శంకర్‌ విషయంలోనూ అదే జరిగింది.

గబ్బర్‌ సింగ్‌ తరవాత హరీష్‌ చేతినిండా అడ్వాన్సులే. అలా.. హరీష్‌ కి అడ్వాన్స్‌ ఇప్పించిన కథానాయకులకలో అల్లు అర్జున్‌ ఒకడు. బన్నీ ` హరీష్‌ కలయికలో ఓ సినిమా ఉంటుందని చెప్పుకొంటున్నారు. ‘రామయ్యా వస్తాయయ్యా’ సెట్‌లో ఉండగానే బన్నీతో సినిమా విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాకి ‘పండగ చేస్కో’ అనే పేరు పెడదాం అనుకొన్నారు. 

అయితే ‘రామయ్యా వస్తావయ్యా’ ఫలితంలో బన్నీ కాస్త జంకుతున్నట్టు సమాచారమ్‌. మరోవైపు అతని కెరీర్‌ కూడా అంత సవ్యంగా లేదు. హిట్టూ, ఫ్లాప్‌ల మధ్య బాలెన్స్‌ అవుతూ వస్తోంది. ఇప్పుడు ‘రేసు గుర్రం’ చేస్తున్నాడు. ఈ చిత్ర దర్శకుడు సురేందర్‌ రెడ్డిని నమ్మడానికి వీల్లేదు. ఎప్పుడు హిట్‌ ఇస్తాడో, ఎప్పుడు ఫ్లాప్‌ ఇస్తాడో చెప్పలేం. 

ఇలాంటి పరిస్థితులో హరీష్‌తో సినిమా చేసేంత రిస్క్‌ బన్నీ తీసుకొంటాడా అనేది అనుమానమే. దానికి తగ్గట్టు బన్నీకి ఇంత వరకూ హరీష్‌ కథే చెప్పలేదట. ఇదే అదునుగా తీసుకొని ఈ సినిమా నుంచి బన్నీ డ్రాప్‌ అయినా అవ్వొచ్చు. ఈ నెలలోనే బన్నీకి హరీష్‌ కథ చెప్తాడట. ఆ కథ ఎక్స్‌ట్రార్డనరీగా ఉంటే ఫర్లేదు. లేదంటే బన్నీ ఈ సినిమా నుంచి తప్పుకోవడం ఖాయం. మరి హరీష్‌ ఏం చేస్తాడో..?