క్రియేటివ్ డైరక్టర్లకు కాలపరిమితి అంటే అస్సలు కిట్టని వ్వవహారం. వాళ్ల స్టయిల్ లో వాళ్లు తీసుకుంటూవెళ్తారు. సినిమా రెడీ అయ్యే టైమ్ కు రెడీ అవుతుంది. కానీ హీరోల సమస్య వేరే. వాళ్లకు వుండే కమిట్ మెంట్లు వాళ్లకు వుంటాయి. అందుకే కరోనా నేపథ్యంలో ఇఫ్పటికే చాలా సమయం వృధాగా పోయిన వైనం దృష్టిలో పెట్టుకుని హీరో బన్నీ డైరక్టర్ సుకుమార్ కు డెడ్ లైన్ విధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
పుష్ప సినిమాను పక్కగా అనుకున్న షెడ్యూళ్లు అనుకున్నట్లు పూర్తి చేసేయాలని, తను ఎలా వర్క్ చేయడానికైనా రెడీ అని, అలా కాకుండా లేట్ చేసి, ఏళ్లూ, పూళ్లూ తీస్తూ వుంటానంటే మాత్రం కుదరదని క్లారిటీగా బన్నీ చెప్పేసినట్లు తెలుస్తోంది.
లేదూ, అలా కుదరదు అంటే, తను గెటప్ తీసేస్తానని, అప్పుడు విగ్ పెట్టి షూట్ చేసుకోవాల్సి వుంటుందని కూడా బన్నీ క్లారిటీ ఇచ్చేసాడట,. ఈ సినిమా కోసం బన్నీ స్లిమ్ గా మారి, రింగు రింగుల జుట్టు పెంచి, డిఫరెంట్ గా తయారైన సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత కొరటాల శివ సినిమా చేయాలి. ఆయన ఆచార్య సినిమా ముగించి వచ్చేసిన కొద్ది నెలలకు తన సినిమా స్టార్ట్ కావాలని, ఆ లోగా పుష్పలో తన వర్క్ పూర్తి చేయాలని బన్నీ చాలా స్పష్టంగా సుకుమార్ కు చెప్పేసినట్లు తెలుస్తోంది.
కానీ సుకుమార్ తో ఇది సాధ్యం అవుతుందా? అన్నదే సందేహం.