వి ట్రయిలర్-ఇంద్రగంటి మరో వైపు

అష్టా చెమ్మా…అమీతుమీ…సమ్మోహనం లాంటి సినిమాలు దర్శకుడు ఇంద్రగంటి క్లాస్ టచ్ ను చూపిస్తాయి. ఆయన చేసిన మిగిలిన సినిమాలు కూడా ఏ తరహావి అయినా కూడా ఇదే తరహా క్లాస్ టచ్ తో వుంటాయి.…

అష్టా చెమ్మా…అమీతుమీ…సమ్మోహనం లాంటి సినిమాలు దర్శకుడు ఇంద్రగంటి క్లాస్ టచ్ ను చూపిస్తాయి. ఆయన చేసిన మిగిలిన సినిమాలు కూడా ఏ తరహావి అయినా కూడా ఇదే తరహా క్లాస్ టచ్ తో వుంటాయి. అలాంటిది తొలిసారిగా ఆయన లోని మరో కోణాన్ని చూపించబోతోంది వి సినిమా. థ్రిల్లర్ సబ్జెక్ట్ తో తయారవుతున్న ఈ సినిమా గురించి బయటకు వచ్చింది తక్కువే. అలాగే ఈ సినిమాకు అయిన ఖర్చు కూడా ఎక్కువే.

ఇలాంటి నేపథ్యంలో వి సినిమా విడుదల డేట్ వచ్చేసింది. సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రయిమ్ లో విడుదల కాబోతోంది. సినిమా ప్రమోషన్లు స్టార్ట్ కాబోతున్నాయి. ట్రయిలర్ కట్ చేసి రెడీ చేసారు. ఈ ట్రయిలర్ చూస్తే ఇంద్రగంటిలో కూడా ఓ భారీ కమర్షియల్ డైరక్టర్ వున్నారు అన్న సంగతి క్లారిటీగా తెలుస్తుంది అంటున్నారు ట్రయిలర్ చూసిన వారు.

సినిమాలో నాని కాస్త గుబురు బియర్డ్ తో, చిన్న కొనదేలిన మీసంతో కొంచెం రఫ్ లుక్ లో ట్రయిలర్ లో కనిపించినట్లు బోగట్టా. కానీ తన స్టయిల్ లో చిన్న చిన్న డైలాగులు డిఫరెంట్ గా చెప్పాడట. ట్రయిలర్ ను ఇద్దరు హీరోలకు ఒక్కోషాట్ వేస్తూ, రెండు షాట్ లకు మ్యాచింగ్ డైలాగ్ తో ప్యాచ్ చేస్తూ డిఫరెంట్ గా కట్ చేసినట్లు తెలుస్తోంది.

ట్రయిలర్ చూడగానే హత్యలు చేసే ఓ సైకో, అతన్ని పట్టుకోవాలనే ఓ పోలీస్ ఇన్ స్పెక్టర్, వీరిద్దరి మధ్య సాగే గేమ్ అని అర్థం అయిపోతుంది. కానీ చివరకు ఎలా ముగుస్తుంది అనేది ఆసక్తికరం. అదే పాయింట్ చెప్పే విధంగా, 'ఎలా క్లోజ్ చేద్దాం' అనేలాంటి డైలాగుతో ట్రయిలర్ ముగుస్తుందని తెలుస్తోంది.