చూస్తూ వుంటే, హీరో రామ్ చరణ్ తన ధృవ సినిమా విషయంలో స్టయిలిష్ స్టార్ బన్నీని ఫాలో అయిపోతున్నట్లు కనిపిస్తోంది. లేదా సరైనోడు, శ్రీరస్తు శుభమస్తు సినిమాలు హిట్ కావడంతో గీతా ఆర్ట్స్ నే ఓ స్వంత సెంటిమెంట్ ను సెట్ చేసుకుందో మరి. సరైనోడు సినిమాకు అడియో ఫంక్షన్ చేయలేదు. అలాగే చాలా ఈవెంట్లు హీరో బన్నీ రాకుండానే జరిగాయి.
ఇప్పుడు ధృవ విషయంలో కూడా రామ్ చరణ్ అలాగే చేస్తున్నారు. సరైనోడుకు అడియో సక్సెస్ మీట్ చేసారు. ఇప్పుడు ధృవకు కూడా అదే తీరు. జులాయి సినిమాలో హీరోకు, విలన్ కు మధ్య మైండ్ గేమ్ లాంటిదే నడుస్తుంది. అయితే అక్కడ ఒకరి మైండ్ సెట్ లాంటిదే ఇద్దరికీ వుండడం. ధృవ లో కూడా విలన్ కు హీరోకు మధ్య మైండ్ గేమ్ నే కీలకం.
మొత్తానికి సక్సెస్ కావాలంటే బన్నీ సిస్టమ్ ను ఫాలో అయిపోవాలని చరణ్ డిసైడ్ అయిపోయాడేమో?