మానసిక సంఘర్షణతో సిగరెట్లకు బానిసగా మారిందట ఏంజెలీనా జోలీ. భర్త బ్రాడ్ పిట్ తో విడాకుల వ్యవహారం గురించి ఈమె ఒక అభిప్రాయానికి రాలేకపోతోందని.. ప్రస్తుతానికి విడిగానే ఉంటున్నా, విడాకుల పిటిషన్ విషయంలో ఏంజెలీనా పునరాలోచనలో ఉందని .. ఈ విషయం గురించి తీవ్రంగా మధనపడుతూ జోలీ పొగకు బానిస అయ్యిందని ఆమె ను బాగా ఎరిగిన వారు చెబుతున్నట్టుగా హాలీవుడ్ పత్రికలు రాస్తున్నాయి.
జోలీ రోజుకు రెండు పెట్టెల సిగరెట్లను ఊదేస్తోందని సమాచారం. ఇప్పటికే ఆమెకు ఉన్న ఆనారోగ్యం దృష్ట్యా పొగ తాగడం ఏ మాత్రం మంచిది కాకపోయినా.. జోలీని నియంత్రించే వాళ్లు మాత్రం ఎవరూ లేరని తెలుస్తోంది. ఆమె చైన్ స్మోకర్ అయ్యిందని, చిమ్నీలా పొగ వదులుతోందని జోలీని దగ్గర నుంచి చూస్తున్న వారు చెబుతున్నారు.
విడాకుల వ్యవహారంలోని టెన్షన్ తోనే ఆమె ఇలా తయారైందని, జోలీ- పిట్ లు విడిపోవడం వారి పిల్లలకు ఇష్టం లేదని, కలిసి ఉండమని పిల్లలు వారిని ప్రాధేయపడుతున్నారని.. పిల్లల కోరికను కాదనలేక, పిట్ తో కలిసి ఉండటానికి సిద్ధంగా లేక జోలీ మధనపడుతోందని తెలుస్తోంది. బ్రాడ్ పిట్ మాత్రం జోలీతో విడాకులకు సుముఖంగా లేడట.