Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బన్నీ సాంగ్ టీజర్ వస్తోంది

బన్నీ సాంగ్ టీజర్ వస్తోంది

పండగ సినిమాల పబ్లిసిటీ విషయంలో అల వైకుంఠపురములో ముందుకు దూసుకుపోతోంది. సామజవరగమన పాట వైరల్ అయిపోయింది. సోషల్ నెట్ వర్క్ లో, టిక్ టాక్, హలో లాంటి యాప్స్ లో ఇలా ఎక్కడ చూసినా ఆ పాటే. ఇప్పుడు మరో పాటను దీపావళి సందర్భంగా విడుదల చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ మాస్ నెంబర్ విడుదలకు ముందుగా చిన్న సాంగ్ టీజర్ ను కూడా విడుదల చేస్తున్నారు.

సోమవారం ఈ సాంగ్ టీజర్ విడదలయ్యే అవకాశం వుంది. మాస్ పాటలోని కీలక కాయినింగ్ పదాలైన 'రాములో..రాములు' అనే బిట్ ను, బన్నీ డ్యాన్స్ మూవ్ మెంట్ ను జోడించి ఈ టీజర్ ను కట్ చేస్తారని తెలుస్తోంది. బన్నీ డ్యాన్స్ మూవ్ మెంట్ ఫ్యాన్స్ ఫుల్ ట్రీట్ గా వుండబోతోందని బోగట్టా.

ఇదిలా వుంటే సినిమాలోని క్యారెక్టర్లను కూడా ఒక్కొక్కటిగా ఇంట్రడ్యూస్ చేసే స్టిల్స్ రిలీజ్ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు. ముందుగా సుశాంత్ స్టిల్ వస్తుందని తెలుస్తోంది. ఈసారి పబ్లిసిటీని కూడా దర్శకుడు తివిక్రమ్ చాలా పద్దతిగా ప్లాన్ చేస్తున్నారు. ఎప్పుడూ బన్నీ పబ్లిసిటీ చూసే ఆయన టీమ్ ను దాదాపు పక్కన పెట్టి, త్రివిక్రమ్, హారిక హాసిని టీమ్ చాలా ప్లాన్డ్ గా ముందుకు వెళ్తున్నారు.

దాంతో అల వైకుంఠపురములో సినిమాకు మాంచి బజ్ రప్పించగలుగుతున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?