బన్నీ-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఫైనల్

వినిపిస్తున్నట్లే, అందరూ అనుకుంటున్నట్లే అల్లు అర్జున్-త్రివిక్రమ్ ప్రాజెక్టు ఫైనల్ అయింది. అది కూడా గ్రేట్ ఆంధ్ర వెల్లడించినట్లు, హిందీ సినిమా రీమేక్ నే. డిసెంబర్ 11న పూజా కార్యక్రమం వుండొచ్చు. జనవరి నుంచి సెట్…

వినిపిస్తున్నట్లే, అందరూ అనుకుంటున్నట్లే అల్లు అర్జున్-త్రివిక్రమ్ ప్రాజెక్టు ఫైనల్ అయింది. అది కూడా గ్రేట్ ఆంధ్ర వెల్లడించినట్లు, హిందీ సినిమా రీమేక్ నే. డిసెంబర్ 11న పూజా కార్యక్రమం వుండొచ్చు. జనవరి నుంచి సెట్ మీదకు వెళ్లే అవకాశం వుంది. ఈ మేరకు తాత్కాలికంగా నిన్నిటికి నిన్న అల్లు అరవింద్ నిర్వహించి గీతా సంస్థ కీలక వ్యక్తుల సమావేశంలో డిసైడ్ చేసారు.

అయితే నిర్మాత ఎవరు? అన్నది మాత్రం ఇంకా డిస్కషన్లలోనే వుంది. గీతాఆర్ట్స్ అన్నది కచ్చితంగా ఓ భాగస్వామిగా వుంటుంది. అది యాభైశాతం మేరకు అన్నది పక్కా. మిగిలిన యాభైశాతం భాగస్వామ్యం ఎవరికైనా ఇస్తారా? ఇవ్వరా? టీ సీరీస్ ఈ సినిమాతో తెలుగునాట భాగస్వామిగా అడుగుపెడుతుందా? హారిక హాసినికి అస్సలు భాగస్వామ్యం వుంటుందా? వుండదా? ఇవన్నీ సోమవారం నాటికి తేలిపోతాయి.

ఇప్పటకి అయితే గీతా భాగస్వామ్యం మాత్రం పక్కా అయింది. మిగిలిన వాటి సంగతి డిస్కషన్లు నడుస్తున్నాయి. ఇది తేలితే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం వుంది. బన్నీ-త్రివిక్రమ్ కలిసి ఇప్పటికి రెండు సినిమాలు చేసారు. ఇది మూడోది అవుతుంది.

కొసమెరుపు ఏమిటంటే, టీసిరీస్ తమ సినిమా హక్కులు కావాలంటే, కచ్చితంగా పార్టనర్ షిప్ ఇచ్చి తీరాల్సిందే అనే పట్టు వదలకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ తన దగ్గర వున్న తన స్వంత కథతోనే ముందుకు వెళ్లే అవకాశం కూడా వుందన్నది. అలాంటపుడు ఇక గీతా, హారిక మాత్రమే భాగస్వాములుగా వుంటాయి.

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి