బన్నీ ఫ్యాన్స్ ఫీలయ్యారా?

బన్నీకి దర్శకుడు త్రివిక్రమ్ కు వున్న అనుబంధం ఇంతా అంతా కాదు. మెగా ఫ్యామిలీలో కేవలం పవర్ స్టార్ తోనూ, బన్నీ తోనే త్రివిక్రమ్ అనుబంధం అంతా. పైగా రామ్ చరణ్ కు త్రివిక్రమ్…

బన్నీకి దర్శకుడు త్రివిక్రమ్ కు వున్న అనుబంధం ఇంతా అంతా కాదు. మెగా ఫ్యామిలీలో కేవలం పవర్ స్టార్ తోనూ, బన్నీ తోనే త్రివిక్రమ్ అనుబంధం అంతా. పైగా రామ్ చరణ్ కు త్రివిక్రమ్ తో సినిమా చేయాలని వున్నా, ఇట్నుంచి మాత్రం రెస్పాన్స్ లేదు. ఇక బన్నీకి త్రివిక్రమ్ అంటే ఎంత ఆసక్తి అంటే, ఇప్పుడు చేస్తున్న సరైనోడుకు, చేయబోయే విక్రమ్ కుమార్ సినిమాకు మధ్యలో త్రివిక్రమ్ తో సినిమా చేసేయాలనేంత. 

అ.. ఆ తరువాత వెంటనే సినిమా చేసేద్దాం అని బన్నీ అన్నాడు.. త్రివిక్రమ్ ఆలోచిస్తున్నాడు. త్రివిక్రమ్ కష్టం.. అంటే అప్పుడు లింగుస్వామితో  చేసేస్తాడు ఆ గ్యాప్ లో..అయినా అది వేరే సంగతి. ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో మొన్నటికి మొన్న సర్దార్ గబ్బర్ సింగ్ అడియో ఫంక్షన్ స్టేజ్ పై త్రివిక్రమ్ ప్రసంగం మాత్రం బన్నీ ఫ్యాన్స్ కు సుతరామూ నచ్చలేదట. మెగాస్టార్ వచ్చారు.. చాలదు అంటే పవర్ స్టార్ ను ఇచ్చారు.. ఇంకా చాలదు అంటే మెగా పవర్ స్టార్ ను ఇచ్చారు.. ఇంకా ఇంకా చాలా మందిని ఇవ్వాలి.. వాళ్లంతా మీలాగే మమ్మల్ని అలరించాలి అన్నాడు త్రివిక్రమ్. 

మరి బన్నీ మాటేమిటి? అతగాడికి వున్న ఇమేజ్ మాటేమిటి? ఇవ్వాళ త్రివిక్రమ్ అన్న మెగా పవర్ స్టార్ కన్నా టాప్ రేంజ్ లో వుంది బన్నీ క్రేజ్. నిజానికి మెగాస్టార్..పవర్ స్టార్..ఆ తరువాత బన్నీనే. మరి త్రివిక్రమ్ ఎందుకు బన్నీ మాట ప్రస్తావించలేదు. త్రివిక్రమ్ కు తెలియక అని అనుకోవడానికి లేదు. తను మీడియం రేంజ్ లో అందించిన సత్యమూర్తిని కూడా బన్నీ నలభై కొట్లకు తీసుకెళ్లాడు. 

అంటే బన్నీ పేరు ప్రస్తావిస్తే మెగా స్టార్ లేదా పవర్ స్టార్ ఫీల్ అవుతారని ఏమన్నా అనుకున్నాడా? లేదా మెగా, పవర్, మెగాపవర్ అంటే కొణిదెల వంశం. బన్నీ అల్లు వారి అబ్బాయి. సో మెగా..లెగసీ అంటే కొణిదెల వారే అయి వుండాలని త్రివిక్రమ్ అనుకున్నాడా? ఏదైనా త్రివిక్రమ్ ప్రసంగంతో బన్నీ ఫ్యాన్స్ ఫీల్ అయ్యారన్నది మాత్రం వాస్తవంగా వినిపిస్తున్న టాక్.