సర్దార్ లో పవన్ లాభం ఎంత?

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేయడం వల్ల పవన్ ఖజానాకు చేరే మొత్తం ఎంత? ఇదే ఇప్పుడు టాలీవుడ్ ఇన్నర్ సర్కిళ్లలో హాట్ టాపిక్. సినిమాకు యూరోస్ పెట్టుబడి పెట్టింది. దాని షరతులు.. దాని…

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేయడం వల్ల పవన్ ఖజానాకు చేరే మొత్తం ఎంత? ఇదే ఇప్పుడు టాలీవుడ్ ఇన్నర్ సర్కిళ్లలో హాట్ టాపిక్. సినిమాకు యూరోస్ పెట్టుబడి పెట్టింది. దాని షరతులు.. దాని వాటా సంగతి ఎలా వున్నా.. హీరో పవన్ కళ్యాణ్ కు కూడా వాటా వుంది. అలాగే ఆయన సన్నిహితుడు శరద్ మురార్ కు వాటా వుంది. 

అంటే మొత్తం లాభాల్లో మూడు వాటాలన్న మాట. సినిమా పవన్ రెమ్యూనిరేషన్ అంటే ఇటు స్క్రిప్ట్..కథ, అటు హీరోగా మొత్తం 15 కోట్లకు పైగానే వున్నట్లు వినికిడి. ఇది మామూలుగా ఖర్చుల్లో వుంటుంది. ఆపై వెంచర్ పూర్తయ్యాక లాభాల్లో వాటా వుంటుంది. గబ్బర్ సింగ్ అమ్మకాలు దాదాపు 80 కోట్ల మేరకు జరిగాయని టాక్ వినిపిస్తోంది. అంటే శాటిలైట్, బాలీవుడ్ తో కలిపి. సినిమాకు ఎంత ఖర్చయినా 50 మించి అవుతుందా అని సందేహం. 

దాదాపు మూడు వంతులు ఒక సెట్ లోనే చేసారు. అది కూడా స్టార్ కాస్ట్ పెద్దగా లేదు. పవన్, కాజల్, బాలీవుడ్ విలన్ మాత్రమే కీలకం. ఇక మిగిలిన వారంతా చిన్న, మీడియం రేంజ్ నటులే. కొందరు దర్శకుల మాదిరిగా కాఫీ కప్పు అందించి వెళ్లేపోయే క్యారెక్టర్ కు సీనియర్ ఆర్టిస్ట్ కావాలనే నియమం ఏమీ పవన్ పెట్టుకోలేదు. అయితే చాలా టైమ్ తీసుకోవడం వల్ల కాస్త ఖర్చులు పెరిగి వుంటాయి. 

అయినా కూడా ఇలా అలా ముఫై కోట్ల లాభాన్ని పవన్, శరద్, యూరోస్ హ్యాపీగా పాకెట్లో కి వస్తుందని ట్రేడ్ జనాలు అంచనా వేస్తున్నారు. అంటే ఈ విధంగా పవన్ కు మరో పది కోట్లు రావాలి. అంటే టోటల్ ప్రాజెక్టు మీద పాతిక కోట్లు అన్నమాట. అత్తారింటికి దారేది తరువాత పవన్ రూటు మార్చారు. గోపాల గోపాల కూడా ప్రాఫిట్ షేరింగ్ మీద చేసారు. ఇప్పుడు ఇది పూర్తిగా పార్టనర్ షిప్ తో చేసారని వినికిడి. 

ఇకపై తరువాతి సినిమాలు కూడా ఇలాగే చేస్తారని టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబు తరువాత ఈ మార్గం పట్టిన పెద్ద హీరో పవన్ నే.