ఆ సినిమాకు ఆ ఛానెల్ ఫైనాన్స్

సినిమాలు రాజకీయాలే కాదు..సినిమాలు మీడియా కూడా ఎప్పుడూ చెట్టాపట్టాలేసుకునే వుంటాయి. అందులోనూ ఇటీవల ఛానెళ్లు సినిమాలు పెట్టుబడి పెట్టడం కూడా మొదలయింది. ఎలాగూ పబ్లిసిటీ చేయాలి.. తాము ఫైనాన్స్ చేస్తే, తమకు వడ్డీ వస్తుంది.పైగా…

సినిమాలు రాజకీయాలే కాదు..సినిమాలు మీడియా కూడా ఎప్పుడూ చెట్టాపట్టాలేసుకునే వుంటాయి. అందులోనూ ఇటీవల ఛానెళ్లు సినిమాలు పెట్టుబడి పెట్టడం కూడా మొదలయింది. ఎలాగూ పబ్లిసిటీ చేయాలి.. తాము ఫైనాన్స్ చేస్తే, తమకు వడ్డీ వస్తుంది.పైగా ఆ మొహమాటంతో ఆ సినిమాకు సంబంధించిన పబ్లిసిటీలో ఎక్కువ భాగం దక్కుతుంది. ఇంకా ఇంకా చాలా వ్యవహారాలు వుంటాయి. 

లేటెస్ట్ బజ్ ఏమిటంటే.. త్వరలో విడుదల కాబోయే ఓ భారీ సినిమాకు తెలుగునాట లీడింగ్ చానెళ్లలో ఒకటి గా వున్న చానెల్ అధిపతి ఫైనాన్స్ చేసారని వార్తలు వినిపించడం. ఆ ఛానెల్ అధిపతికి ఆ నిర్మాతకు మంచి సంబంధాలు వున్నాయి. ఆ సినిమాకు ఆ నిర్మాత రెగ్యులర్ సినిమా ఫైనాన్షియర్ల నుంచి కాకుండా, తన స్వంత పరిచయాల నుంచి తెచ్చారని తెలుస్తోంది. 

ఓవర్ సీస్ లో సినిమాలు కొనే సంస్థ అధిపతి కూడా కొంత ఫైనాన్స్ చేసారని వినికిడి. మొత్తం మీద ఇలా చాలా ఫైనాన్స్ లు ఆ సినిమా కోసం తెచ్చారని తెలుస్తోంది.