బిజినెస్ లు ఎలా వున్నాయి

పోస్ట్ సమ్మర్ బరిలో చిన్న, మీడియం సినిమాలు మిగిలాయి. ఒక విధంగా సాక్ష్యం ఒక్కటే 40 కోట్ల రేంజ్ సినిమా. మిగిలినవి అన్నీ 10 నుంచి 20 కోట్ల సినిమాలే. చిన్న, మీడియం సినిమాలకు…

పోస్ట్ సమ్మర్ బరిలో చిన్న, మీడియం సినిమాలు మిగిలాయి. ఒక విధంగా సాక్ష్యం ఒక్కటే 40 కోట్ల రేంజ్ సినిమా. మిగిలినవి అన్నీ 10 నుంచి 20 కోట్ల సినిమాలే. చిన్న, మీడియం సినిమాలకు బిజినెస్ నే సమస్య. శాటిలైట్ తో సహా బిజినెస్ మొత్తం పూర్తయితేనే నిర్మాతలు గట్టెక్కుతారు. పెద్ద సినిమాలు అంటే ఎగబడి అడ్వాన్స్ లు ఇచ్చి మరీ కొనేసే బయ్యర్లు , చిన్న మీడియం సినిమాల దగ్గరకు వచ్చేసరికి ఆట మొదలెట్టేస్తారు. రింగ్ అయిపోవడం, కొనకపోవడం, రేట్ డౌన్ చేయడం ఇలా చాలా వ్యవహారాలు జరుగుతుంటాయి. ప్రస్తుతం రాబోయే చిన్న, మీడియం సినిమాల బిజినెస్ లు ఎలా వున్నాయంటే..

పంతం..గోపీచంద్ హీరోగా కొత్త డైరక్టర్ తో నిర్మాత రాధామోహన్ నిర్మించే ఈ సినిమాకు ఖర్చు కాస్త గట్టిగానే అయింది. సబ్జెక్ట్ పరంగా ఖర్చుచేయాల్సి రావడంతో ఖర్చు, పబ్లిసిటీ కలిపి 20 దాటేసింది. అయితే అదృష్టం కొద్దీ శాటిలైట్, డిజిటల్ హిందీ రైట్స్ కలిపి 11 కోట్ల వరకు రికవరీ అయింది. ఆంధ్ర ఆరు నుంచి ఏడు కోట్ల రేషియోలో, అదే విధంగా సీడెడ్ అమ్మాకాలు చేయగలిగారు. నైజాం మాత్రం కొన్ని టెర్మ్ తొ వుంచుకున్నారు. దాంతో దగ్గర దగ్గర రికవరీ జరిగింది. ఓవర్ ఫ్లోస్ వస్తే నిర్మాతకు లాభాలు వుంటాయి.

తేజ్ ఐ లవ్యూ..ఈ సినిమాను కూడా నైజాంలో ఇంధ్ర ఫిలింస్ ద్వారా అడ్వాన్స్ మీద అందిస్తున్నారు. సీడెడ్, వైజాగ్ అమ్మేసారు. మిగిలిన ఏరియాలు మెల్ల మెల్లగా క్లొజ్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా ఆంధ్ర ఆరు కోట్ల రేషియోలోనే ఇచ్చారు. టోటల్ గా శాటిలైట్, డిజిటల్ తో కలిసి టేబుల్ ప్రాఫిట్ కు దగ్గరగా వున్నారు.

సాక్ష్యం – బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన శ్రీవాస్ డైరక్షన్ లో సినిమా ఇది. పంచ భూతాల కాన్సెప్ట్ తో సిజి వర్క్ తో సినిమా నిర్మించడంతో పబ్లిసిటీ అంతా కలిసి 38 కోట్లకు డేకేసింది ఖర్చు. అయితే ఈ సినిమాకు కూడా శాటిలైట్, డిజిటల్ హిందీ రైట్స్ బాగా ఆదుకున్నాయి. ఆంధ్ర ను రకరకాల రేషియలో అమ్మేసారు. నైజాం దిల్ రాజు ద్వారా స్వంతగా విడుదల చేస్తున్నారు. సీడెడ్ అమ్మేసారు. నైజాం అంచనా వాల్యూ కూడా కలుపుకుంటే, దగ్గర దగ్గర అన్నీ కలిపి 38 వరకు రావడం బొటాబొటిగా సాధ్యమైంది. ఇక నిర్మాతకు లాభాలు అంటే ఓవర్ ఫ్లోస్ మీదనే ఆధారపడి వుంటుంది వ్యవహారం.

శంభో శంకర చిన్న సినిమా పబ్లిసిటీ, నిర్మాణం అంతా కలిపి నాలుగున్నర కోట్లలో చేసారు. పబ్లిసిటీకి కోటిన్నర ఖర్చు చేయడం విశేషం. రేట్లు మరీ భారీగా లేవు కాబట్టి బిజినెస్ డీల్స్ బాగానే జరుగుతున్నాయి. ఆంధ్ర, సీడెడ్ కలిపి చాలా వరకు రికవరీ అయిపోయే చాన్స్ వుంది. నైజాం డీల్ పూర్తయితే బ్రేక్ ఈవెన్ అవుతారు. శాటిలైట్ వుండనే వుంది. 

దిల్ రాజు నిర్మించిన సినిమా లవర్. రాజ్ తరుణ్ హీరో. ఈ సినిమాకు ఎనిమిది కోట్ల వరకు బడ్జెట్ కావడం విశేషం. రాజ్ తరుణ్ రెమ్యూనిరేషన్, అయిదుగురు బాలీవుడ్ సంగీత దర్శకులను వాడడం, మేకింగ్ క్వాలిటీ చూసుకోవడంతో కాస్త ఎక్కువే ఖర్చయింది. అయితే మా టీవీకి ముందే రెండున్నరకు శాటిలైట్ చేసేసారు. అందువల్ల కొంత రికవరి అయిపొయింది. ఇక దిల్ రాజు రెగ్యులర్ బయ్యర్లు కాబట్టి, బిజినెస్ సమస్య లేదు.