దాదాపు ఏడాది కాలంగా రూమర్లలోనే బతికేస్తున్న సినిమా ఒకటి వుంది. అదిగో పవన్ సాధినేని సినిమా ఇదిగో హరికృష్ణ..కళ్యాణ్ రామ్..ఎన్టీఆర్ అని ఓ సారి టాక్.
మళ్లీ మరోసారి బాలయ్య-కళ్యాణ్ రామ్-ఎన్టీఆర్ అని టాక్.
ఇలా ఏడాది కాలంగా వినిపిస్తూనే వస్తోంది. ఒకటే వాస్తవం. పవన్ సాధినేని అనే డైరక్టర్ తయారు చేసిన స్క్రిప్ట్ ను కళ్యాణ్ రామ్ లాక్ చేసిన మాట వాస్తవం. దాన్ని తనే నిర్మించాలనుకోవడం వాస్తవం. దానికి సరైన సీనియర్ హీరో ఎవ్వరూ దొరకడం లేదన్నది అంతకన్నా వాస్తవం.
నిజానికి బాలయ్య బాబాయ్ ఆ సినిమా చేస్తే బాగుండును అని కళ్యాణ్ రామ్ కు వుంది. కానీ అంత గొప్ప సంబంధాలు వాళ్ల మధ్య ఇప్పుడు లేవని ఇండస్ట్రీలో గుసగుసలు వున్నాయి. అందుకే ఈ ప్రాజెక్టు అలా అలా పక్కన వుంది. ప్రస్తుతం గుహన్ డైరక్షన్ లో కళ్యాణ్ రామ్ ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఎంతో ఆశపడిన నానువ్వే పరాజయం పొందడంతో, ఇప్పుడు ఆ సినిమాను అంత సులువుగా జనాల్లోకి వదల్లేరు.
ఈ లోగా కళ్యాణ్ రామ్ కు బూస్టో..బోర్నవిటానో కావాలి. మళ్లీ కాస్తయినా క్రేజ్ కనిపించాలి. అప్పుడే ఈ సినిమాను వదలగలరు. అందుకే ఇప్పుడు పవన్ సాధినేని సినిమాను అనౌన్స్ చేయాలని చూస్తున్నారు. అయితే దాన్ని అనౌన్స్ చేయాలంటే ఎవరో ఒక సీనియర్ హీరో ఆ స్క్రిప్ట్ కు ఓకె అనాలి.
ఆ హీరో ఎవరు? ఎవరు? ఎవరు?
బాలయ్య, వెంకటేష్, నాగార్జున, మోహన్ లాల్, ఈ నలుగురికి కథ చెప్పించే పనిలో వున్నాడు కళ్యాణ్ రామ్. కానీ బాలయ్య ఫుల్ బిజీగా వున్నారు. రెండు పార్ట్ లు బయోపిక్, బోయపాటి సినిమా వున్నాయి. వెంకీ క్యాంప్ లో స్క్రిప్ట్ వినిపించడం, ఓకె చేయించుకోవడం అంటే నెలలు చాలవు.
ఏళ్లు కావాలని టాక్. ఇక మిగిలింది నాగ్. మోహన్ లాల్. నాగ్ అయితే రెడీగా ఓ ప్రాజెక్టు కూడా లేదు. ఆయన ఆఫీసర్ డిజాస్టర్. ఆయన చేద్దాం అనుకున్న కళ్యాణ్ కృష్ణ నేలటికెట్ డిజాస్టర్. అందుకే ఇంకా ఏ పాజెక్టు కూడా లేదు.
ఇక మోహన్ లాల్ అయితే స్క్రిప్ట్ బాగుంటే రెడీ.
అందుకే వీళ్లద్దరికి కథ చెప్పే ప్రయత్నంలో వున్నారు. ఎవ్వరు ఒకె అన్నా, ప్రాజెక్టు ప్రకటిస్తే, కళ్యాణ్ రామ్ కు కాస్త బూస్ట్, బోర్నవిటా అందినట్లే.