సినిమాకు టైటిల్ పవర్ పుల్ గా వుండడం అవసరమే కానీ, మరీ పవర్ ఫుల్ టైటిల్ అయినా ఒక్కోసారి చీదేస్తుంటుంది..ఎక్స్ పెక్టేషన్లు ఎక్కువై. వన్ అనీ, నిప్పు అనీ, అగ్ని అనీ, అగ్గిరవ్వ అనీ, కత్తి అనీ ..ఇలా పవర్ ఎక్కువైనా కష్టమే. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ తొలి సినిమాకు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల బుద్దిగా..ఆయన స్టయిల్ లో గొల్లభామ అని పేరు పెట్టారు.
అబ్బే మాస్ మహా జనాలకు ఇదేం టైటిల్ అన్నది నాగబాబు అభ్యంతరం. అందునా కొడుకు తొలిసినిమానాయె. అందుకే ఆయన వేరే టైటిళ్ల కోసం వెదుకుతున్నారు. గతంలో ఈ సినిమాకు అత్తారింటికి దారేది..పాట..'ఆరడుగుల బుల్లెట్' అన్నటైటిల్ వినిపించింది. మళ్లీ దాన్నిబయటకు తీస్తున్నారని టాక్.
కానీ ఇలా బుల్లెట్ అంటే ఆరంభంలోనే మరీ ఓవర్ గా వుంటుందేమో? ఆలోచించాలి. గతంలో బాపు-కృష్ణం రాజు కాంబినేషన్ లో బుల్లెట్ అన్న సినిమా వస్తే, పావలా కూడా వసూలు చేయలేనంత ఫ్లాప్ గా మిగిలింది. మరి నాగబాబు ఏం ఆలోచిస్తారో చూడాలి.