బయ్యర్ గా ‘అర్జున్ రెడ్డి’

విజయ్ దేవరకొండ అంటే ఇప్పుడు యూత్ లో మాంచి క్రేజ్ వుంది. అర్జున రెడ్డి ఇచ్చిన కిక్ అది. ఆ సినిమా తరువాత విజయ్ నటించిన టాక్సీవాలా సినిమా మే 18న ప్రేక్షకుల ముందుకు…

విజయ్ దేవరకొండ అంటే ఇప్పుడు యూత్ లో మాంచి క్రేజ్ వుంది. అర్జున రెడ్డి ఇచ్చిన కిక్ అది. ఆ సినిమా తరువాత విజయ్ నటించిన టాక్సీవాలా సినిమా మే 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఓ డిఫరెంట్ హర్రర్ జోనర్ సినిమా ఇది. ఈ సినిమాతో విజయ్ డిస్ట్రిబ్యూటర్ గా కూడా మారుతున్నాడు. టాక్సీవాలా ఓవర్ సీస్ హక్కులు విజయ్ దేవరకొండ 70 నుంచి 80లక్షల మధ్యలో రేట్ కు తీసుకున్నాడు.

ఈ సినిమాను చాలా స్మూత్ బడ్జెట్ తో ఫినిష్ చేసారు. జస్ట్ అన్నీ కలిపి మూడు కోట్ల రేంజ్ లో ఫినిష్ చేసారు. పెళ్లిచూపులు తరువాత విజయ్ ను మాట్లాడుకున్నారు. దాంతో జస్ట్ 30లక్షలే రెమ్యూనిరేషన్ ఇచ్చారు. ఇంకా చిత్రమేమిటంటే సినిమా నిర్మాణానికి ముందే ప్రాఫిట్ కావడం. ఎందుకంటే శాటిలైట్, డిజిటల్ హక్కులు అమ్మేసి, ఆ డబ్బులతో సినిమా ఫినిష్ చేసేసారు.

ఇప్పడు ఏపీ, తెలంగాణ థియేటర్ రైట్స్ మీద ఎంత వచ్చినా లాభమే. ఈ సినిమాను బన్నీవాస్, యువి వంశీ, దర్శకుడు మారుతి వెనుక వుండి నిర్మించారు. నిర్మాతగా ఎస్ కె ఎన్ వ్యవహరించారు. పెద్ద తలకాయలు వెనుక వుండడం వల్ల, ఇక అమ్మాల్సిన పని లేదు. నేరుగా విడుదల చేసుకోవచ్చు. హిట్ అయితే డబ్బులే డబ్బులు. విజయ్ దేవరకొండ క్రేజ్ వుండనే వుంది. ఓపెనింగ్స్ తేవడానికి.