నాగ చైతన్య సినిమాల విషయంలో సమంత జోక్యం ఎక్కువైందా? ప్రస్తుతం ఇదే మాట వినిపిస్తోంది తెలుగు సినిమా వర్గాల్లో. భర్తకి స్టార్ స్టేటస్ తీసుకురావడం కోసం సమంత అతని సినిమాల ఎంపికలోను, పూర్తయిన తర్వాత సదరు సినిమా చూసి సలహాలివ్వడంలోను ఆమె బాగా యాక్టివ్గా వుంటోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
'శైలజారెడ్డి అల్లుడు' జాప్యానికి సమంత సలహాల మేరకు జరుగుతోన్న మార్పులు కారణమనే గాసిప్ వుంది. చైతన్య ముందు, తర్వాత పరిచయమైన హీరోల్లో చాలా మంది తర్వాతి స్థాయికి చేరుకోగా అతను మాత్రం ఇంకా అదే ప్లేస్లో పాతుకుపోయాడు. ఒక స్థాయి దాటి వెళ్లలేకపోతోన్న చైతన్యని స్టార్ చేయడానికి నాగార్జున చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు.
దీంతో భర్తని స్టార్ చేయడానికి సమంత పూనుకుంటోందని, ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా చైతన్య కూడా తన సినిమాల విషయంలో అతిగా కల్పించుకుంటున్నాడని వినిపిస్తోంది. ఇదంతా సమంత ప్రభావమేనని, సవ్యసాచి చిత్రం ఆలస్యం కావడానికి కూడా చైతన్య ఇంటర్ఫియరెన్స్ వుందని చెబుతున్నారు.
ఈ జోక్యం నిజమే అయితే దీని ఫలితాలు అటైనా వుండొచ్చు, లేదా ఇటైనా వుండొచ్చు. చైతన్య రేంజ్ ఏమైనా పెరుగుతుందా లేదా అనేది శైలజారెడ్డి అల్లుడు, సవ్యసాచి చిత్రాలతో తేలిపోతుంది.