చరణ్‌ మళ్లీ అండర్‌ప్లే చేస్తున్నాడా?

చిరంజీవి పుట్టినరోజుకి చరణ్‌ కొత్త సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ వస్తాయని అనుకున్నారు కానీ అదేమీ జరగలేదు. చిరంజీవి పుట్టినరోజుని కేవలం సైరా ప్రమోషన్స్‌కి మాత్రమే చరణ్‌ వాడుకున్నాడు. నిర్మాతగా ఆ చిత్రంపై చరణ్‌…

చిరంజీవి పుట్టినరోజుకి చరణ్‌ కొత్త సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ వస్తాయని అనుకున్నారు కానీ అదేమీ జరగలేదు. చిరంజీవి పుట్టినరోజుని కేవలం సైరా ప్రమోషన్స్‌కి మాత్రమే చరణ్‌ వాడుకున్నాడు. నిర్మాతగా ఆ చిత్రంపై చరణ్‌ ఎక్కువ కాన్సన్‌ట్రేట్‌ చేస్తున్నాడు. దీంతో తన సినిమా సైడ్‌లైన్‌ అవుతోంది.

ఇంకా విడుదల ఎప్పుడనేది కూడా తెలియని సైరా చిత్రంపై ఎక్కువ కాన్సన్‌ట్రేట్‌ చేస్తూ మరో నాలుగు నెలల్లో రాబోతున్న తన చిత్రం పబ్లిసిటీపై మాత్రం చరణ్‌ దృష్టి పెట్టడం లేదు. 'ఖైదీ నంబర్‌ 150' టైమ్‌లోను చరణ్‌ ఇలాగే వ్యవహరించాడు. ధృవ చిత్రానికి కనీసం మంచి సీజన్‌ కూడా చూడకుండా విడుదల చేసాడు.

తండ్రితో నిర్మిస్తోన్న చిత్రాలపై చరణ్‌ ఎక్కువ ఫోకస్‌ పెట్టడం, తన చిత్రాలని సైడ్‌లైన్‌ చేయడం అభిమానులకి నచ్చడం లేదు. బోయపాటి దర్శకత్వంలో చరణ్‌ చేస్తోన్న చిత్రం ఎలా వుంటుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొన్న నేపథ్యంలో ఈ పాటికి దానిపై ఒక అంచనా ఏర్పరిచి వుండాల్సింది.

కానీ చరణ్‌ ఆ దిశగా ఆలోచించడం లేదు. అటు తన తండ్రి చేస్తోన్న చిత్రాలతో పాటు తన చిత్రాలకి కూడా సమ ప్రాధాన్యం ఇస్తే తన చిత్రాల నిర్మాతలు, దర్శకులు కూడా హ్యాపీగా వుంటారుగా.