చైతూ పక్కా మిడిల్ క్లాస్

హీరో నాగ్ చైతన్య తొలిసారి ఓ డిఫరెంట్, మిడిల్ క్లాస్ క్యారెక్టర్ ను చేస్తున్నట్లు కనిపిస్తోంది. శేఖర్ కమ్ముల డైరక్షన్ లో సునీల్ నారంగ్ నిర్మించే సినిమా ఫస్ట్ విడియో బైట్ ను చైతన్య…

హీరో నాగ్ చైతన్య తొలిసారి ఓ డిఫరెంట్, మిడిల్ క్లాస్ క్యారెక్టర్ ను చేస్తున్నట్లు కనిపిస్తోంది. శేఖర్ కమ్ముల డైరక్షన్ లో సునీల్ నారంగ్ నిర్మించే సినిమా ఫస్ట్ విడియో బైట్ ను చైతన్య బర్త్ డే సందర్భంగా విడుదల చేసారు. జస్ట్ బిజిఎమ్ తో నాగ్ చైతన్య పాత్రను పరిచయం చేసారు

ఈ విడియోలో. చిన్న రూమ్ ను తనే చీపురుతో తుడుచుకోవడం, బాగా కష్టపడుతున్నట్లు చూపించడం, ఓ సీన్ లో బాగా ఏడవడం ఇవన్నీ చూస్తుంటే మధ్యతరగతి కష్టాల నేపథ్యంలోనో, మరో విధంగా కాస్త భావోద్వేగాల స్టోరీలో చైతన్య పార్ట్ అయినట్లు కనిపిస్తోంది.

శేఖర్ కమ్ముల కొత్త హీరోతో స్టార్ట్ చేసిన ఈ సినిమా, ఆరంభంలోనే ఆపేసి, చైతన్య తో తీస్తున్నారు. హీరోది చాలా కీలకమైన పాత్ర కావడంతో కొత్త హీరో సూట్ కాక, చైతన్యను తీసుకున్నారు. ఇప్పుడు విడియో బైట్ చూస్తుంటే పాత్ర కాస్త డిఫరెంట్ గానే డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది. 

తొలిసారి చైతన్యం ఇంత తక్కువ హెయిర్ తో, ఈ తరహా పాత్ర పోషించడం. అయితే  వదిలింది టీజర్ కాదు కాబట్టి, సినిమా విషయాలు ఏమీ తెలియడం లేదు. నాగ్ చైతన్య వరకు చూసుకుంటే ఓ కొత్త ప్రయత్నం చేస్తున్నట్లే అనుకోవాలి.