సమంత-నాగ్ చైతన్య అన్నది సక్సెస్ ఫుల్ జోడీ. ఏమాయ చేసావే, మనం లాంటి సూపర్ హిట్ లు వున్నాయి. ఈ జోడీని మళ్లీ రిపీట్ చేద్దామని అనుకుంటున్నారు దర్శకుడు మారుతి. ఫుల్ స్క్రిప్ట్ నెరేషన్ ఇచ్చినా, ఇవ్వకున్నా, ముందు ఈ జోడీ విషయం మాత్రం చెప్పాడట నాగ్ చైతన్యకు.
అయితే నాగ్ చైతన్య మాత్రం వేరే సన్నిహితుల దగ్గర ఈ విషయం ప్రస్తావించి, తనకు అంతగా ఇష్టం లేదన్నట్లు కామెంట్ చేసినట్లు బోగట్టా. పెళ్లి అయిన వెంటనే ఒకవేళ ఆ సినిమా కనుక ఒప్పుకుని, సమంతతో జోడీకడితే, ఫలితం తేడావస్తే సెంటిమెంట్ గా ఫీలవ్వాలని, పైగా జనాలు ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేస్తారని, ఇదంతా అవసరమా? అని చైతన్య అభిప్రాయ పడినట్లు ఆ వర్గాల బోగట్టా.
చైతూ ది కూడా పాయింట్ నే. చిన్న తేడా వస్తే, మన జనాలు రకరకాలుగా మోసేస్తారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటకు ఈ రిస్క్ అవసరమా? ఎవరి సినిమాలు వాళ్లు చేసుకుంటే పోలా? అయితే ప్రాజెక్టు కు క్రేజ్ వస్తుందన్నది దర్శకుడు మారుతి ఆలోచన మాత్రం సూపరే. ఎందుకంటే కొత్త పెళ్లి జంట తొలి సినిమా అయితే ఆనందమే కదా అభిమానులకు. మారుతి ఆ ఏంగిల్ లో ఆలోచిస్తున్నట్లుంది.