Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చైతూ వర్క్ పూర్తి? ఎన్టీఆర్ ఎవరు?

చైతూ వర్క్ పూర్తి? ఎన్టీఆర్ ఎవరు?

మహానటి సినిమా షూట్ పూర్తయిపోయింది. గుమ్మడికాయ కొట్టేసారు. మార్చి నెలాఖరుకు విడుదల చేద్దాం అనుకుంటే, ఆ టైమ్ కు సినిమా షూటింగ్ మాత్రం పూర్తి చేయగలిగారు.

ఇంకా విఎఫ్ఎక్స్ వగైరా పనులు వుండనే వున్నాయి. మరి అసలు సంగతి మాత్రం ఇంకా తెలియలేదు. అదే ఎన్టీఆర్, ఎఎన్నార్ పాత్రల గురించి. ఎఎన్నార్ గా నాగచైతన్య నటించడానికి ఓకె అన్నాడు. మూడురోజులు షూట్ చేసారని కూడా వార్తలు వినవచ్చాయి.

మరి ఇంతకీ ఎన్టీఆర్ పాత్ర సంగతేమిటి? అన్నది మాత్రం బయటకు రాలేదు. ఎన్టీఆర్ గా ఓ పేరున్న నటుడినే ఒప్పించి, చిత్రీకరించారని వినిపిస్తోంది.

ఒకపక్క నాని చేత చేయించారని, లేదు అదొక్కటీ డిజిటల్ చేయించారని వినిపిస్తోంది. ఏ విషయమూ మహానటి టీమ్ వెల్లడించడం లేదు. లీకులు మహానటికి కామన్ కాబట్టి, అంతవరకు వెయిట్ చేయడమే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?