Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఛాంగురే..భలే కామెడీ థ్రిల్లరే

ఛాంగురే..భలే కామెడీ థ్రిల్లరే

సమ్ థింగ్ డిఫరెంట్ గా వుంటే తప్ప చిన్న సినిమా వున్న థియేటర్ వైపు తొంగి చూడడం లేదు జనాలు. అందుకే కొత్త కొత్త కథల మీద కసరత్తు చేస్తున్నారు కథకులు. 

కామెడీ గా స్టార్టై, థ్రిల్లర్ టర్న్ తీసుకునే సినిమాలు గతంలో కూడా వచ్చాయి. ఇప్పుడు అదే జానర్ లో ఓ సినిమా నిర్మించారు హీరో రవితేజ. తన స్వంత బ్యానర్ ఆర్ టి టీమ్ వర్క్స్ బ్యానర్ మీద చిన్న, మీడియం నటులను పెట్టి ఈ సినిమాను నిర్మించారు.

ఛాంగురే బంగారు రాజా అనే వెరైటీ టోటల్ తో వస్తున్న ఈ సినిమాలో ఓ జర్మన్ షెపర్డ్ డాగ్ కీలకపాత్ర పోషిస్తోంది. పైగా దీనికి డబ్బింగ్ హీరో కమ్ కమెడియన్ సునీల్ చెప్పడం విశేషం. కార్తీక్ (కేరాఫ్ కంచరపాలెం), కమెడియన్లు సత్య, రవిబాబు కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాకు సతీష్ వర్మ దర్శకుడు.

చాలా ఇంట్రస్టింగ్ స్టార్ట్ అయింది ఈ సినిమా టీజర్. పాత్రల పరిచయం తరువాత ఓ మర్డర్ తో థ్రిల్లర్ టర్న్ తీసుకుంది. జానర్ కొత్తగా లేకపోయినా ట్రీట్ మెంట్, ఫన్ డైలాగులు కలిసి ఓ మాంచి థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ ను చూడబోతున్నామన్న ఫీల్ ను కలిగించాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?