రామ్ చరణ్ ఓకె అన్న సినిమాలేవీ లేవు. అయితే ఓకె చేసిన కథ మాత్రం వుంది. అది కోనవెంకట్, గోపీమోహన్ లది. ఆ విషయం చరణ్ స్వయంగా గోవిందుడు విడుదలకు ముందు చెప్పాడు. ఇప్పుడు ఆ కథను ఫైనల్ చేసి సెట్ పైకి తీసుకెళ్లే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. గోపీ మోహన్, కోనవెంకట్ కథకు డైరక్టర్ ఎవరు అన్నది ఇంకా డిసైడ్ అవలేదు. అయితే ఈ రోజు లక్ష్యం దర్శకుడు శ్రీవాస్ ను రైటర్ల ద్యయం చరణ్ దగ్గరకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
వారు లౌక్యం సినిమాకు శ్రీవాస్ తో కలిసి పని చేసారు. మంచి కలెక్షన్లు సాధించారు. అందువల్ల ఈ సినిమాకు కూడా తాము ముగ్గురు కలిసి చేస్తామని వారు చరణ్ కు వివరించినట్లు తెలుస్తోంది. మెగా క్యాంపస్ వ్యవహారం వేరుగా వుంటుంది. దర్శకుడికి మరీ ఎక్కువ తెలియక్కరలేదు. మెగా డైరక్షన్ పైన వుండనే వుంటుంది. అందువల్ల శ్రీవాస్ ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టిై, చరణ్ ఓకె అన్నా అనొచ్చు.