ఈతరం స్టార్ హీరోల్లో తరచుగా క్యాలెండర్ మిస్ అవుతోన్నది రామ్ చరణ్ ఒక్కడే. మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ తదితరులంతా సినిమా తర్వాత సినిమా వెంటనే లైన్లో పెడుతూ ఏడాదికి ఒక్క సినిమా అయినా రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నారు. కానీ చరణ్ మాత్రం ప్రతి సినిమా మధ్య చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు.
ధృవ విడుదలకి ముందే సుకుమార్‌తో సినిమా ఖరారైనా కానీ అది సెట్స్ మీదకి వెళ్లడానికి చాలా సమయం పట్టింది. ఫిబ్రవరిలో మొదలు కావాల్సిన చిత్రం మండుటెండల్లో మొదలయ్యే సరికి యూనిట్‌కి వడదెబ్బ తగిలి షూటింగ్ డిలే అయింది.
కోస్తా తీర ప్రాంతంలో తీద్దామనుకున్న చిత్రాన్ని సెట్స్‌లో తీస్తున్నారు. మొన్న దసరాకి రావాల్సిన ఈ చిత్రం సంక్రాంతికి కూడా సిద్ధం కాక మార్చి 30కి వెళ్లింది. దీంతో చరణ్‌కి ఈ ఏడాది రిలీజ్ లేకుండా పోయింది. అయితే నిర్మాతగా తొలి విజయాన్ని అందుకున్న చరణ్‌కి ఈ ఏడాది చిరస్మరణీయమే అవుతుంది.