“నాకెందుకో మంచి మంచి ఐడియాలు ఉదయం ఎక్సర్ సైజ్ చేసేటప్పుడే వస్తుంటాయి. ఆ రోజు కూడా ఉదయం లేచి ఎక్సర్ సైజ్ చేస్తున్నాను. సడెన్ గా మెరుపులాంటి ఆలోచన. హలో.. హలో.. హలో.. వెంటనే సుప్రియకు ఫోన్ చేశాను. హలో అనే టైటిల్ రిజిస్టర్ చేయమని చెప్పాను.”
ఇలా హలో టైటిల్ వెనక పెద్ద తతంగమే నడిచిందంటున్నాడు నాగార్జున. ఆ పేరు పెట్టిన ఘనత తనదే అని ప్రకటించుకున్నాడు.
“నిజానికి 3నెలలుగా టైటిల్ గురించి ఆలోచిస్తున్నాం. దాదాపు 50పేర్లు పరిశీలించాం. ఏదీ నచ్చలేదు. ఆరోజు ఎక్సర్ సైజ్ చేస్తున్నప్పుడు వచ్చిన టైటిల్ హలో. ఈ టైటిల్ ను విక్రమ్ కుమార్ కు ఎలా చెప్పాలో అర్థంకాలేదు. అందరికీ తెలిసిన హలో అనే కామన్ పదాన్ని విక్రమ్ కుమార్ ఒప్పుకుంటాడని నేను అనుకోలేదు. కానీ నేను చెప్పిన వెంటనే విక్రమ్ కూడా ఒప్పుకున్నాడు.” ఇలా హలో టైటిల్ వెనక కహానీని బయటపెట్టాడు నాగార్జున.
మొత్తానికి ఈ టోటల్ ఎపిసోడ్ లో సినిమాకు టైటిల్ కూడా విక్రమ్ కుమార్ ఫిక్స్ చేయలేదనే విషయాన్ని నాగార్జున పరోక్షంగా బయటపెట్టాడు. ప్రమోషన్ లో భాగంగా ఇప్పటికే నాగార్జున, అఖిల్ కలిసి మీడియాకు కామన్ గా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ తర్వాతే అఖిల్ అమెరికా వెళ్లాడు.