యంగ్ హీరోలు, హీరోయిన్ల మంచి స్నేహమే కాదు, చనువు వుంటుంది. అయితే అది పబ్లిక్ గా బయటపడదు. ఒక్కోసారి యాక్సిడెంటల్ గా తెలిసిపోతూ వుంటుంది. సైరా సక్సెస్ మీట్ లో అదే జరిగింది. హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ హీరో రామ్ చరణ్ ను 'రా' అంటూ సంబోధించడం విశేషం.
తమన్నా మాట్లాడుతూ ఒక్కొక్కరి గురించి ప్రస్తావిస్తూ, చరణ్ దగ్గరకు వచ్చింది. 'చరణ్ నువ్వు కో యాక్టర్ గా బెటర్ నా, ప్రొడ్యూసర్ గా బెటర్ నా, ఏం చెప్పాలి రా' అనేసింది. వేదిక మీద వున్న మెగాస్టార్ గంభీరంగా వుండిపోగా, మిగిలినవారు ముసి ముసినవ్వులు నవ్వారు.
అదే వేదిక మీద రామ్ చరణ్ మాట్లాడుతూ, తమన్నా గురించి ప్రస్తావించబోయి మా నయనతార అని అనేసినపుడు, ఆమె గలగలా నవ్వడం విశేషం. ఆ నవ్వు ఎంతకీ ఆపకపోవడంతో, చరణ్, నువ్వు నవ్వడం ఆపేస్తే, మాట్లాడతా అంటూ చనువుగా అనడం విశేషం.