స్నేహం కోసం 70 లక్షలు?

ఆయన ఓ నిర్మాత. ఓ బయ్యర్. ఓ ఎగ్జిబిటర్. పైగా ఓ పెద్ద హీరో ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. ఆయన లేటెస్ట్ గా విడుదలైన ఓ భారీ సినిమాను ఓ ఏరియాకు పంపిణీ చేసే…

ఆయన ఓ నిర్మాత. ఓ బయ్యర్. ఓ ఎగ్జిబిటర్. పైగా ఓ పెద్ద హీరో ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. ఆయన లేటెస్ట్ గా విడుదలైన ఓ భారీ సినిమాను ఓ ఏరియాకు పంపిణీ చేసే బాధ్యతలు తీసుకున్నారు. ఈ మధ్య టాలీవుడ్ లో ఓ కొత్త ట్రెండ్ మొదలయింది. కలెక్షన్ల విషయంలో ఫ్యాన్స్, మీడియా చాలా హుషారుగా వుంటున్నారని, ముందగానే బయ్యర్ల దగ్గరే, వాళ్ల చేతే కావాల్సిన ఫిగర్లను బయటకు వదుల్తున్నారు. దీనికి ఆ హీరో, ఈ హీరో అన్న మినహాయింపు లేదు.

అలా చేయకపోతే, తరువాత సినిమాను ఆ బయ్యర్ కు ఇవ్వకుండా చేస్తారన్న భయం. సరే, ఈ ముచ్చట అలావుంచితే, సదరు భారీ సినిమా తొలిరోజు ముందు చెప్పుకున్న బయ్యర్ కమ్ హీరో స్నేహితుడు 70 కలిపి కలెక్షన్ల ఫిగర్ వదిలారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా చేయడానికి ఆయన ముందుగానే ఫిక్స్ అయిపోయారట.

తన ఏరియాలో అరవింద సమేత, తదితర సినిమాలు తొలిరోజు ఎంత చేసాయి, ఈ సినిమా ఎంత చేయాలి అన్నది ముందుగానే ఓ అంచనాకు వచ్చి, 70 లక్షలు కలిపి ఫిగర్ బయటకు వదిలినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 

బాహుబలి వేసిన బాటలో నడిచాడు 'సైరా'