సైరా క్రెడిట్ రామ్ చరణ్ కా..? సురేందర్ రెడ్డికా?

రిలీజ్ కి ఇంకా రెండురోజులే టైముండటంతో సైరా పబ్లిసిటీ పీక్స్ కి చేరుకుంది. బాలీవుడ్ తో పాటు పక్క రాష్ట్రాలకు వెళ్లి సైరా టీమ్ మీడియాతో ముచ్చటిస్తోంది. రాజకీయాలతో సహా బోలెడన్ని కొత్త విషయాలు…

రిలీజ్ కి ఇంకా రెండురోజులే టైముండటంతో సైరా పబ్లిసిటీ పీక్స్ కి చేరుకుంది. బాలీవుడ్ తో పాటు పక్క రాష్ట్రాలకు వెళ్లి సైరా టీమ్ మీడియాతో ముచ్చటిస్తోంది. రాజకీయాలతో సహా బోలెడన్ని కొత్త విషయాలు చెబుతున్నారు హీరో చిరంజీవి. అంతా బాగానే ఉంది కానీ సినిమా టీమ్ లో కెప్టెన్ ఆఫ్ ది షిప్ మాత్రం మిస్సవుతున్నాడు.

అవును… ప్రచారానికి పిలవలేదో, లేదా కావాలనే పక్కనపెట్టారో తెలియదు కానీ బాలీవుడ్ మీడియా ముచ్చట్లలో సురేందర్ రెడ్డి ఎక్కడా కనపడ్డం లేదు. గతంలో హిందీ టీజర్ లాంచ్ టైమ్ లో మాత్రమే సురేందర్ రెడ్డి, చిరంజీవి, రామ్ చరణ్ తో కలిసి కనిపించారు. ఆ తర్వాత ఆయన తెలుగులో అన్ని ఛానెళ్లకు సోలో ఇంటర్వ్యూలు ఇస్తూ వచ్చారు. నిర్మాత రామ్ చరణ్, హీరో చిరంజీవి కలసి బాలీవుడ్ ప్రచారాన్ని భుజానికెత్తుకున్నారు. పక్క రాష్ట్రాల్లో కూడా వీరే కనపడుతున్నారు కానీ సురేందర్ రెడ్డికి మాత్రం ప్లేస్ దక్కలేదు.

అదే రాజమౌళి సినిమా తీస్తే మరోలా ఉండేది. బాలీవుడ్ లో కానీ, పక్క రాష్ట్రాల్లో కానీ డైరెక్టరే సెంటరాఫ్ అట్రాక్షన్ అయ్యేవారు. ఎంత పెద్ద బడా హీరో అయినా రాజమౌళిని వెంటబెట్టుకుని వెళ్తేనే అతనికి గౌరవం. అయితే ఇక్కడ సురేందర్ రెడ్డికి అంత పాపులార్టీ లేదు కాబట్టి ఆయన్ను పక్కనపెట్టినట్టున్నారు. టాలీవుడ్ మినహా మిగతా ప్రాంతాల్లో సైరా పేరు చెప్పగానే చిరంజీవి ఆ తర్వాత రామ్ చరణ్ పేరే వినిపిస్తోంది. ఇక్కడ రామ్ చరణ్ కి వస్తున్న క్రెడిట్ ని ఏమాత్రం తక్కువ చేయలేం. ఎందుకంటే ఈ సినిమా ఈ రేంజ్ లో రావడానికి రామ్ చరణ్ కృషే ఎక్కువగా ఉంది.

మంచి టీమ్ సెట్ చేసుకోవడం, ప్రొడక్షన్ పనులన్నీ భుజానికెత్తుకోవడం, సినిమాకి మంచి హైప్ తీసుకురావడం, ఇతర భాషల నటీనటుల్ని ఎంపిక చేసుకుని, వారి కాల్షీట్ల వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకోవడం, ప్రమోషన్.. వగైరా వగైరా.. వీటన్నిటిలో రామ్ చరణ్ పాత్ర కీలకం. నిర్మాత కాబట్టి ఆమాత్రం సాహసం చేయాల్సిందే అనుకున్నా.. అందరూ ఇలా అన్ని విషయాలను చూసుకోవడం కష్టం. అందుకే సైరా పేరు చెప్పగానే దర్శకుడికంటే ముందు నిర్మాత రామ్ చరణే గుర్తుకొస్తున్నారు. కేవలం రిలీజ్ కు సంబంధించిన వ్యవహారాలు, తెలుగు మీడియా ప్రమోషన్ వరకు మాత్రమే సురేందర్ రెడ్డిని పరిమితం చేశారు.

చిరంజీవి గారి వల్లనే అవన్నీ సాధ్యం అయ్యాయి