అక్టోబర్ 1న ‘గోవిందుడు అందరివాడేలే’ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. టైట్ షెడ్యూల్ ప్లాన్ చేసుకుని… అన్నీ సవ్యంగా జరుగుతాయనే భరోసాతో ఈ డేట్‌కి అందుకోవాలని ఈ చిత్ర బృందం కృషి చేస్తోంది. కానీ ఫారిన్ షెడ్యూల్స్, పాటల షూటింగ్స్ వగైరా బ్యాలెన్స్ ఉంచుకుని మరో నెల రోజుల్లో ఫస్ట్ కాపీ రెడీ చేయడమనేది అనుకున్నంత ఈజీ కాదు.
గోవిందుడు అక్టోబర్ 1కి మిస్ అయ్యే అవకాశాలున్నాయనే సంకేతాలు కనిపిస్తూ ఉండడంతో దసరాకి మెగా సంబరాలు మిస్ అవుతాయేమో అనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. అయితే గోవిందుడు అందరివాడేలే కనుక డ్యూ డేట్ మిస్ అయితే… ఆ స్థానంలో మెగా హీరో వరుణ్ తేజ్ ‘ముకుంద’ని రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు.
‘ముకుంద’ని దసరాకి విడుదల చేయాలనే లక్ష్యంతోనే వేగంగా షూటింగ్ జరిపారు. అయితే చరణ్ సినిమాతో పోటీ పెట్టడం ఇష్టం లేక దాని రిలీజ్ దీపావళికి పెట్టుకున్నారు. ఇప్పుడు గోవిందుడు, ముకుంద రెండూ దసరాకి రిలీజ్ అయ్యే టార్గెట్‌తోనే ముందుకి కదులుతున్నాయి. ఒకటి మిస్ అయినా కానీ మరొకటి తప్పకుండా రిలీజ్ అవుతుంది కనుక మెగా సంబరాలకి ఢోకా ఉండబోదట.