Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఛత్రపతిని పక్కన పెట్టారా?

ఛత్రపతిని పక్కన పెట్టారా?

చాన్నాళ్లయింది బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా తీరమీదకు వచ్చింది. అల్లుడు అదుర్స్ సినిమా దారుణంగా ప్లాప్ అయిన తరువాత మళ్లీ తెలుగు తెర మీద కనిపించలేదు. 

అల్లుడు అదుర్స్ విడుదలై దాదాపు రెండున్నరేళ్లు దాటింది. పోనీ ఏదైనా సినిమా తెలుగులో నిర్మాణంలో వుందా అంటే అదీ లేదు. ప్రభాస్ ఛత్రపతిని హిందీలో రీమేక్ చేస్తున్నారు. వెదికి వెదికి వివి వినాయక్ కే దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. కానీ ఆ సినిమా పరిస్థితి ఏమిటో? ఎప్పుడు బాలీవుడ్ లో విడుదలవుతుందో తెలియదు.

నిజానికి బాలీవుడ్ లో ఇప్పుడు సౌత్ సినిమాలకు సానుకూల వాతావరణం వుంది. అయినా కూడా ఛత్రపతి రీమేక్ ను విడుదల చేసే ఆలోచన చేస్తున్నట్లు కనిపించడం లేదు. అయినా ఛత్రపతి రీమేక్ తెలుగు సినిమా కిందకు రాదు. తెలుగు వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది తెలియదు. ఎందుకంటే ప్రభాస్-రాజ‌మౌళి ఓ రేంజ్ లో చేసి అందించిన సినిమా అది.

మరి తెలుగు సినిమా ప్లాన్ ఎందుకు చేయడం లేదు బెల్లంకొండ అన్నది మిలియన్ డాలర్ల క్వశ్చను. ఏ హీరో కూడా ఖాళీగా లేరు. కానీ బెల్లంకొండ మాత్రం ఏ ప్రాజెక్ట్ ఎందుకు టేకప్ చేయడం లేదు అన్నది తెలియడం లేదు. ఎంత మార్కెట్ డౌన్ అయింది అనుకున్నా ఎంతో కొంత వుంటుంది కదా? అసలు ఏం జ‌రుగుతోంది అన్నది బెల్లంకొండ వైపు నుంచే సమాధానం తెలియాల్సి వుంది. 

ఈ లోగా మరో గ్యాసిప్ కూడా వినిపిస్తోంది. ఛత్రపతి రీమేక్ అనుకున్న రేంజ్ లో రాలేదని, దానికి చాలా రీషూట్ లు చేయాల్సి వుందని, అందుకే పక్కన పెట్టారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అది పూర్తి చేసి హిందీ నిర్మాతకు ఇచ్చే వరకు మరో సినిమా చేసే అవకాశం లేదని, అందుకే బెల్లంకొండ అలా వుండిపోయారని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?