మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సినిమా గాడ్ ఫాదర్. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ స్పెషల్ అట్రాక్షన్. నయనతార, సత్యదేవ్ అదనపు తారాగణం. దసరా సందర్భంగా విడుదలవుతున్న ఈ సినిమా ను కాస్త పద్దతిగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్లు.
సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు అంటే తెగ పరిచేస్తారు. దొరికిన థియేటర్లు అన్నీ వేసేస్తారు. కానీ ఈసారి అలా జరగడం లేదని తెలుస్తోంది.
ఈ సినిమాకు పోటీగా నాగార్ఙున ఘోస్ట్ సినిమా వుండడమే కాదు దీనికి కారణం. మెగాస్టార్ చిరంజీవి నే వీలయినంత హడావుడి లేకుండా విడుదల చేయమని చెప్పారని తెలుస్తోంది. ఆచార్య సినిమా ఫలితంతో మెగాస్టార్ బాగా దిగాలు పడ్డారు. మరోసారి ఫలితం తేడా వస్తే మిగిలిన వెనుక వున్న సినిమాల పరిస్థితి దారుణంగా వుంటుంది.
అందుకే పెద్దగా హడావుడి చేయకుండా, ఎక్కడ దియేటర్లలో పరిచేయకుండా విడుదల ప్లాన్ చేయమని మెగాస్టార్ స్వయంగా నిర్మాతకు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. చూడాలి తక్కువ థియేటర్లు అంటే ఎన్ని స్క్రీన్ లు వుంటాయో?