జగన్ ను ఫాలో అంటున్న కేసిఆర్

కేసిఆర్ మోస్ట్ సీనియర్ పోలిటీషియన్. అనేక రాజకీయ యుద్దాల్లో ఆరితేరిన నాయకుడు. కేసిఆర్ తో పోల్చుకుంటే జగన్ చాలా జూనియర్. అయితే సినిమాల మాదిరిగా రాజకీయాల్లో కూడా కొత్త తరం ఆలోచనలు అవసరం పడుతున్నాయి. …

కేసిఆర్ మోస్ట్ సీనియర్ పోలిటీషియన్. అనేక రాజకీయ యుద్దాల్లో ఆరితేరిన నాయకుడు. కేసిఆర్ తో పోల్చుకుంటే జగన్ చాలా జూనియర్. అయితే సినిమాల మాదిరిగా రాజకీయాల్లో కూడా కొత్త తరం ఆలోచనలు అవసరం పడుతున్నాయి. 

ఓల్డ్ స్కూల్ రాజకీయాలు నడవడం లేదు. కేసిఆర్ కూడా ఈ సంగతి గమనించినట్లున్నారు. జగన్ ను ఫాలో..ఫాలో అంటూ తన కేడర్ కు చెబుతున్నారు.

రేషన్ ను ఇంటికే పంపడం, పింఛన్ ను ఇళ్లకే తీసుకెళ్లి ఇవ్వడం వంటి స్కీములు ఆంధ్రలో అమలు చేసారు జగన్. కిట్టని పార్టీలు, వాటి సోషల్ మీడియా అందులో పరమార్థం గమరించలేకపోయారు. జోక్ లు  వేసుకున్నారు, మీమ్ లు చేసుకున్నారు. కానీ జగన్ తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. 

చంద్రబాబు జన్మభూమి వాలంటీర్లు అంటూ కొందరికి అవకాశం ఇచ్చారు కానీ, వారిని ఎలా వాడాలో అలా వాడలేదు. కానీ వాలంటీర్ వ్యవస్థను రూపొందించిన జగన్ దాన్ని ఎలా వాడాలో అలా వాడుతున్నారు.

ఇంటింటికీ పింఛన్ అందిస్తున్నారు. రేషన్ అందిస్తున్నారు. ఎరువులు, విత్తనాలు, ఇతర సమాచారం జనాలకు అందేలా చేస్తూ ఓ రిలేషన్ ను డెవలప్ చేసారు. ఇది ఎన్నికల్లో పనికి వస్తుందా? రాదా? అన్న సంగతి పక్కన పెడితే రేషన్ ను ఇంటికే ఇవ్వడం అన్నది ఇతర రాష్ట్రాలు కూడా మంచి ఆలోచన అన్నాయి.

అలాగే ఎమ్మెల్యేలను నాయకులను జనాల దగ్గరకు పంపే కార్యక్రమం జగన్ చేపట్టారు. జనాల్లోనే వుండండి అని చెబుతూ వస్తున్నారు.

ఇప్పుడు సేమ్ టు సేమ్ ఇవే మాటలు కేసిఆర్ కూడా చెబుతున్నారు. ఎమ్మెల్యేలను జనంలోకి వెళ్లమంటున్నారు. ఫింఛన్లు, దళితబంధు నేరుగా ఇళ్లకే వెళ్లి ఇవ్వమంటున్నారు. చూస్తుంటే ఎప్పుడో ఒకప్పుడు విలేజ్ వాలంటరీ వ్యవస్థను కూడా ఏర్పాటుచేసేలా వున్నారు.