బెంగాల్ సర్కారుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ షాక్ ఇచ్చింది. ఘన మరియు ద్రవ వ్యర్థాల ఉత్పత్తి మరియు శుద్ధిలో భారీ అంతరం కారణంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 3,500 కోట్ల రూపాయల జరిమానా విధించింది.
2022-2023 రాష్ట్ర బడ్జెట్ లో పట్టణాభివృద్ధి, పురపాలక వ్యవహారాలపై రూ.12,818.99 కోట్లు కేటాయించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మురుగునీరు, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ సౌకర్యాల ఏర్పాటుకు ప్రాధాన్యతనిస్తున్నట్లు కనిపించడం లేదని గ్రీన్ ప్యానెల్ పేర్కొంది.
కాలుష్య రహిత వాతావరణాన్ని అందించడం రాష్ట్రం మరియు స్థానిక సంస్థల రాజ్యాంగ బాధ్యత అని ఎన్జిటి చైర్పర్సన్ జస్టిస్ ఎకె గోయల్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని.. నిబంధనలు ప్రభుత్వం ఉల్లంఘించినందుకు పరిహారం చెల్లించాల్సిందనేనని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సృష్టం చేసింది.
రోజు రోజుకు పెరుకు పోతున్న కాలుష్యం, వ్యర్థాలను ప్రభుత్వలు పట్టించుకోవాడం లేదనేది వాస్తవం ఇప్పటికి అయిన అన్ని రాష్ట్ర ప్రభుత్వలు కాలుష్య రహిత వాతారణంనికి శ్రీకారం చూడితే మంచింది. అసలే ప్రపంచం మొత్తం అతి వృష్టి అనావృష్టి తో అల్లడుతోంది. దీనికి కారణం వాతవరణ మార్పులే అన్ని చెప్పుతున్నా ఏ ప్రభుత్వాలు కూడా కాలుష్యం కట్టడి వైపు అడుగులు వేయడం లేదు. ప్రతి దేశం అభివృధి చేందడం ఎంత ఆవసరమే ప్రజల ఆరోగ్యలు అంతే ఆవసరం అనేది గుర్తించాలి.