శృంగారం కోసం మగాళ్ళు పడని పాట్లు వుండవు. ఒక్కోసారి ప్రాణాలకు కూడా తెగిస్తారు. బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా యాపిల్ పండంత సెక్సీగా వుంటుందని వేరే చెప్పక్కర్లేదు. ఆవిడ ఇంటర్ చదివే రోజుల్లో అమితాబ్ బచ్చన్ నటించిన ‘డాన్’ సినిమా చూడటానికి ఫ్రెండ్స్‌తో కలిసి థియేటర్‌కు వెళ్ళిందట.
సినిమా హాల్‌లో తమ వెనుక వరుసలో కొంతమంది ఆకతాయి కుర్రాళ్ళు కూర్చుని కుర్చీలను తన్నుతూ అల్లరి చేస్తుంటే ప్రీతి జింటా ‘స్టుపిడ్స్’ అని తిట్టిందట. ఇంటర్వెల్ తర్వాత సినిమా స్టార్ట్ అయ్యాక సడెన్‌గా కరెంట్ పోయిందట. థియేటర్ వాళ్ళు జనరేటర్ ఆన్ చేసేలోగా కొన్ని నిమిషాలు చీకటి.
ఈలోగా వెనుక కూర్చున్న కుర్రాడు.. ప్రీతి జింటాని చీకట్లో ముద్దు పెట్టుకుని పారిపోయాడట. కెవ్వుమని అరిచిందట ప్రీతి జింటా. లైట్లు వెలిగాక ఏమైందని అందరూ అడుగుతుంటే, జరిగింది చెప్పడానికి సిగ్గుపడి, ఎలుక కాళ్ళ మీద నుండి వెళ్ళిందని చెప్పిందట. వెనక్కి తిరిగి చూస్తే, ఇద్దరు కుర్రాళ్ళు కనిపించలేదట. చీకట్లో చిత్రాలు జరుగుతాయి మరి.