Advertisement


Home > Movies - Movie Gossip
చెర్రీ సినిమా అబౌట్ టర్న్

రామ్ చరణ్-సుకుమార్ సినిమా సంగతి భలే చిత్రంగా వుంది. ఈ సినిమా లోకేషన్ కోసం చేసిన కసరత్తు ఇంతా అంతా కాదు. పక్కా బెల్ బాటమ్ ఫ్యాంట్లు, చెంపలపై పొడుగాటి సైడ్ కట్స్, హిప్పీ స్టయిల్ జుట్లు ఇలా 80 ల నాటి గెటప్ లతో రాసుకున్న కథ ఇది. పైగా హీరో చెవిటివాడు.లుంగీ, దుబ్బు గడ్డం ఇలాంటివి. దీనికి తోడు దీన్ని ఈస్ట్ గోదావరిలోని నాచురల్ లొకేషన్లలోనే తీయాలని అను కున్నారు దర్శకుడు సుకుమార్. అలా కాదు, హైదరాబాద్ లోనో, ఆ చుట్టుపక్కలో సెట్ వేద్దాం అన్నారు రామ్ చరణ్.

అసలు ఆర్ట్ డైరక్టర్ దగ్గరే తకరారు వచ్చింది. సుకమార్ చెప్పిన పేరు చరణ్ కు నచ్చలేదు. చరణ్ చెప్పిన పేరు సుకుమార్ కు నచ్చలేదు. ఆఖరికి మధ్యేమార్గంగా వేరే ఆర్ట్ డైరక్టర్ ను సెట్ చేసుకున్నారు. విలేజ్ సెట్ కు రామ్ ఛరణ్ మలేషియా, బ్యాంకాక్ ప్రాంతా ల ఐలాండ్స్ లో వుండే ఇళ్ల డిజై న్లు తెప్పించారు. సుకుమార్ మన నేటివిటీ కావాలన్నారు. సరే పోలాచ్చి వెళ్లి చూద్దాం అనుకున్నారు. అదీ అయింది. ఆఖరికి నేచురల్ గా వుంటుంది. ఈస్ట్ గోదావరికే వెళ్దాం అనుకున్నారు. అదే చేసారు.

కానీ పని తెవలడం లేదు. అభిమానులు వచ్చేస్తున్నారు. చరణ్ వారితో ముచ్చట్లు, అక్కడి గ్రామాల్లో తిరగడం, షూటింగ్ తక్కువ.హడావుడి ఎక్కువ అయింది. ఆఖరికి ఎంతో కొంత చేసాం అని వెనక్కు వచ్చారు. ఇక్కడ కొన్ని సెట్ లు వేసి వర్క్ ప్రారంభించారు. ఇక ఈ ఎండలు, జనాల సమస్య, అందుకే ఇక హైదరాబాద్ లోనే సెట్ లు వేసి కానిచ్చేద్దామని డిసైడ్ అయ్యారు . అవుట్ డోర్ తప్ప ని చోట్ల కొన్ని రోజులు వెళ్లి, షాట్లు తీసుకు వస్తారు. అవీ ఇవీ మిక్స్ చేసుకుంటారు.

మొత్తం మీద సుకుమార్ నాచురల్ విలేజ్ షూట్ కాస్తా , సెట్ లో షూట్ గా మారుతోంది.