నాగ్ చైతన్య-పరశురామ్ కాంబినేషన్ లో చిచ్చరో సినిమా రీమేక్ అంటూ ఓ గ్యాసిప్ బయటకు వచ్చింది. కానీ ఇది పక్కా గ్యాస్ ఇప్ తప్ప వేరు కాదని తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ చాలా విషయాలు, అభ్యంతరాలు వున్నాయి. ముందుగా అసలు ఏ సినిమా చేయాలి అన్న దాని మీది నాగ్ చైతన్య ఇంకా డిసైడ్ కాలేదు.
అక్కడ ఆల్రెడీ అజయ్ భూపతిని లైన్ లో వుంచారు. ఒకటి , రెండురోజులు అంటూ చెబుతూ వస్తున్నారు. రెండవది రీమేక్ చేయాలని దర్శకుడు పరుశురామ్ ఆసక్తి గా లేరు. ఆయన తన స్వంత కథతోనే వెళ్లాలని అనుకుంటున్నారు.
అదీ కాక చైతన్య డేట్ లు కావాలంటే కనీసం ఇంకో మూడు నెలలు ఆగాలి. ఇప్పటి వరకు నెలల తరబడి సినిమా లేకుండా వున్న పరుశురామ్ అప్పటి వరకు ఆగడానికి రెడీ యేనా? ఆయన ప్రభాస్ తో సినిమా కోసం ప్రయత్నాలు ఓ పక్క చేస్తూనే వున్నారు. మరి వాటి సంగతి ఏదో ఒకటి తేలాల్సి వుంది కదా?
ఇవన్నీ పక్కన పెడితే చిచ్చోరే సినిమా రీమేక్ వ్యవహారం గీతా సంస్థతో ముడిపడి వుంది. ఆ సినిమా ఎప్పుడు ఎవరు చేసినా, గీతాతో లింక్ వుంటుంది. పరుశురామ్ తో ఇప్పుడప్పుడే గీతాలో సినిమా వుండే అవకాశం తక్కువ.
ఇలా అన్ని విధాలా చూసుకుంటే చైతన్య-పరుశురామ్-చిచ్చోరే రీమేక్ అన్నది గ్యాస్..ఇప్ నే.