సుకుమార్ దర్శకత్వంలో చిరంజీవి?

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ గాసిప్ జోరుగా వినిపిస్తోంది. ఓ అదిరిపోయే మాస్ మసాలా స్టోరీతో చిరంజీవిని ఫ్లాట్ చేశాడు సుక్కు. దాదాపు అర్థగంట పాటు స్టోరీ నెరేట్ చేశాడు. ఇది విన్న చిరంజీవి చాలా…

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ గాసిప్ జోరుగా వినిపిస్తోంది. ఓ అదిరిపోయే మాస్ మసాలా స్టోరీతో చిరంజీవిని ఫ్లాట్ చేశాడు సుక్కు. దాదాపు అర్థగంట పాటు స్టోరీ నెరేట్ చేశాడు. ఇది విన్న చిరంజీవి చాలా ఎగ్జయిట్ అయ్యాడు. వెంటనే కథను 2గంటల సినిమాగా డెవలప్ చేయమని సూచించాడు. సుకుమార్ స్టయిల్ లోనే ఈ సినిమాలో కూడా ఓవిలక్షణమైన పాత్రలో కనిపించబోతున్నాడట చిరు.

తన కథలతో హీరోలను ఒప్పించడం సుకుమార్ కు వెన్నతో పెట్టిన విద్య. నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్, వన్-నేనొక్కడినే సినిమాలో మహేష్ నటించారంటే దానికి కారణం హండ్రెడ్ పర్సెంట్ సుకుమార్ సత్తానే.

అంతెందుకు.. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న రంగస్థలం సినిమాలో చెవిటివాడిగా నటించడానికి రామ్ చరణ్ ఒప్పుకున్నాడంటే సుకుమార్ టాలెంట్ అర్థం చేసుకోవచ్చు. ఇదే టాలెంట్ తో ఓ డిఫరెంట్ రోల్ తో, సరికొత్త కథతో చిరంజీవిని ఒప్పించాడట సుక్కూ.

ప్రస్తుతం సైరా సినిమా పనులతో బిజీగా ఉన్నాడు చిరంజీవి. ఈ మూవీ కంప్లీట్ అయితే తప్ప తన నెక్ట్స్ సినిమాపై ఎలాంటి నిర్ణయం తీసుకోడు. మరోవైపు లిస్ట్ లో బోయపాటి ఉండనే ఉన్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చిరంజీవి హీరోగా బోయపాటి సినిమా ఎప్పట్నుంచో పెండింగ్ లో ఉంది. ఈ ప్రాజెక్టును కూడా పక్కనపెట్టి సుకుమార్ కు చిరంజీవి అవకాశమిస్తాడేమో చూడాలి.

రామ్ చరణ్ తో ధృవ సినిమా చేసిన వెంటనే చిరంజీవిని డైరక్ట్ చేసిన ఛాన్స్ అందుకున్నాడు సురేందర్ రెడ్డి. సెంటిమెంట్ ప్రకారం, చరణ్ తో రంగస్థలం సినిమా చేస్తున్న సుకుమార్.. చిరును డైరక్ట్ చేసే అవకాశం అందుకుంటాడేమో. ప్రస్తుతం గాసిప్ లెవెల్లో ఉన్న ఈ న్యూస్ పై క్లారిటీ రావాలంటే సైరా ఓ కొలిక్కి రావాలి.