నాని కారుకు ప్రమాదం-గాయాలు?

హీరో నాని ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. రోడ్ నెంబర్ 45లో నాని ప్రయాణిస్తున్న కారు ఈ తెల్లవారు ఝామున నాలుగు గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురయింది. వాహనం నడుపుతూ డ్రయివర్ నిద్రలోకి జారుకోవడంతో…

హీరో నాని ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. రోడ్ నెంబర్ 45లో నాని ప్రయాణిస్తున్న కారు ఈ తెల్లవారు ఝామున నాలుగు గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురయింది. వాహనం నడుపుతూ డ్రయివర్ నిద్రలోకి జారుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో నాని ముక్కుకు, రెండు పళ్లకు, ముఖానికి గాయాలయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఏ ఆసుపత్రి అన్నది మాత్రం తెలియరాలేదు.

ప్రస్తుతం నాని వరుస సినిమాలతో బిజీగా వున్నాడు. ఒక్క రోజు కూడా గ్యాప్ తీసుకోకుండా సినిమాల్లో నటిస్తున్నాడు. గత ఏడాది మూడు హిట్ లు ఇచ్చిన నాని, ఈ ఏడాది కూడా మరో మూడు సినిమాలు అందించే దిశగా షూటింగ్ లు చేస్తున్నాడు.

నాని యూనిట్ వర్గాలను సంప్రదించి నిజానిజాలు తెలుసుకోవాలనుకున్నా, వీలు కాలేదు.