చిరంజీవి మంత్రం పఠిస్తున్నాడు

మొదటి సినిమాతో ‘గౌరవం’ తెచ్చుకోలేకపోగా, తన నటనతో విమర్శలు చవిచూసిన అల్లు శిరీష్‌ ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌ దర్శకుడు మారుతి దర్శకత్వంలో ‘కొత్త జంట’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని మారుతి తన శైలికి…

మొదటి సినిమాతో ‘గౌరవం’ తెచ్చుకోలేకపోగా, తన నటనతో విమర్శలు చవిచూసిన అల్లు శిరీష్‌ ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌ దర్శకుడు మారుతి దర్శకత్వంలో ‘కొత్త జంట’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని మారుతి తన శైలికి భిన్నంగా క్లీన్‌ ఫిలింగా తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ఒక్క స్మోకింగ్‌ లేదా డ్రిరకింగ్‌ షాట్‌ కూడా ఉండనంత క్లీన్‌ సినిమా అట. 

ఇకపోతే ఈ చిత్రంలో చిరంజీవి ‘ఖైదీ నంబర్‌ 786’ చిత్రంలోని ‘అటు అమలాపురం… ఇటు పెద్దాపురం’ పాటని రీమిక్స్‌ చేశారట. ఈ పాటకి అల్లు శిరీష్‌తో పాటు మధురిమ నర్తిస్తుందట. చిరంజీవి పాటల్ని రీమిక్స్‌ చేసుకున్న చరణ్‌కి ఇంతవరకు అలా చేసిన ప్రతి సినిమాతో హిట్టొచ్చింది. చేయని వాటితో ఫ్లాపులొచ్చాయి. 

అల్లు శిరీష్‌ కూడా తనకి అలాగే చిరంజీవి పాట కలిసి వస్తుందని అనుకుంటున్నాడేమో. మెగా హీరోల రెండో సినిమాలు క్లిక్‌ అయ్యాయి కాబట్టి తనకి కూడా అలాగే రెండో సినిమాతో అదృష్టం కలిసి వస్తుందని ఇప్పటికే శిరీష్‌కి బాగా నమ్మకముంది. ఇప్పుడు మెగాస్టార్‌ సాంగ్‌ కూడా జత కలిసింది కాబట్టి అది డబుల్‌ అయి ఉంటుంది.