షెర్లీన్‌ చోప్రా పబ్లిసిటీ పాట్లు

పూనమ్‌ పాండే పబ్లిసిటీలో తనకు సాటెవరూ రారన్పించుకుంటే, ఆమెకు పోటీగా పబ్లిసిటీ స్టంట్లు చేస్తోంది షెర్లీన్‌ చోప్రా. తెలుగులో ‘ఎ ఫిలిం బై అరవింద్‌’ సినిమాలో నటించిన షెర్లీన్‌ చోప్రా, బాలీవుడ్‌కి వెళ్ళింది, హాలీవుడ్‌లోనూ…

పూనమ్‌ పాండే పబ్లిసిటీలో తనకు సాటెవరూ రారన్పించుకుంటే, ఆమెకు పోటీగా పబ్లిసిటీ స్టంట్లు చేస్తోంది షెర్లీన్‌ చోప్రా. తెలుగులో ‘ఎ ఫిలిం బై అరవింద్‌’ సినిమాలో నటించిన షెర్లీన్‌ చోప్రా, బాలీవుడ్‌కి వెళ్ళింది, హాలీవుడ్‌లోనూ సత్తా చాటుకుంటానంటోంది.

ప్లే-బాయ్‌ కోసం న్యూడ్‌గా ఫొటోలకు పోజులిచ్చేసి సంచలనం సృష్టించిన షెర్లీన్‌, ‘కామసూత్ర`3డి’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో తనకు పేరు ప్రఖ్యాతులు సంపాదించిపెడ్తుందనే ధీమాతో వుంది షెర్లీన్‌ చోప్రా. ఇక ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా, ట్విట్టర్‌ని వేదికగా చేసుకుని సెమీ న్యూడ్‌ ఫొటోల్ని నెటిజన్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

షెర్లీన్‌ గతంలోనే ట్విట్టర్‌ వేదికగా సెమీ న్యూడ్‌ ఫొటోలతో హల్‌చల్‌ చేసింది. తాజాగా ‘కామసూత్ర`3డి’ సినిమా విషయమై ఆమె చేస్తోన్న పబ్లిసిటీ స్టంట్స్‌ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. పూనమ్‌ కూడా ఇలానే పబ్లిసిటీ కోసం ఎన్ని సెక్సీ వేషాలు వేసినా, ఆమె తొలి బాలీవుడ్‌ సినిమా ‘నషా’ ఆశించిన విజయం సాధించలేకపోయింది.

మరి, షెర్లీన్‌ భవిష్యత్‌ ఏమవుతుంది.? ఆల్రెడీ బాలీవుడ్‌లో ఒకటీ ఆరా సినిమాల్లో నటించిన షెర్లీన్‌, ‘కామసూత్ర`3డి’తో సంచలనాలు సృష్టిస్తుందా.? బోల్తా కొడ్తుందా.? వేచి చూడాల్సిందే.