మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ఎంతవరకు వచ్చింది. ఎప్పుడో పరుచూరి బ్రదర్స్ రాసిన స్క్రిప్ట్ ను దర్శకుడు సురేందర్ రెడ్డి చెక్కడం ఎంత వరకు పూర్తయింది? ఇలా ప్రశ్నిస్తే వినవస్తున్న సమాధానం, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే వుందన్నదే. ఇప్పటికి దాకా ఈ సినిమాకు సంబంధించి, ఒక నటిని కానీ, నటుడిని కానీ సంప్రదించలేదు. ఒక టెక్నీషియన్ ను ఎవరినీ కాంట్రాక్టు ఛేయలేదు. షెడ్యూలు అనేదే ప్లాన్ చేయలేదు. ఇప్పటి దాకా ఎవరికీ రూపాయి అడ్వాన్స్ అందలేదు. ఇవీ వినిపిస్తున్న గుసగుసలు.
కానీ రోజూ రామ్ చరణ్ నిర్మాణ కార్యాలయానికి మాత్రం దర్శకుడు సురేందర్ రెడ్డి టంచన్ గా వస్తున్నారట. రోజంతా అక్కడే వుండి వెళ్తున్నారట. మరి సురేందర్ రెడ్డి రోజంతా ఏం చేస్తున్నారన్నదే అనుమానంగా వుంది. స్క్రిప్ట్ ను మొత్తంగా మారుస్తున్నారని, ఏనాటి కాలంలోనో రాసిన పరుచూరి స్క్రిప్ట్ ను పూర్తిగా, ఈ జనరేషన్ ఆడియన్స్ కు నచ్చేలా, మార్చడంలోనే సురేందర్ రెడ్డి తలమునకలై వున్నారని తెలుస్తోంది.
పైగా నిర్మాత రామ్ చరణ్ తన సుకుమార్ డైరక్షన్ సినిమాలో బిజీగా వున్నారు. చిరంజీవి తన ఎమ్ ఇకే ప్రొగ్రామ్ లో బిజీగా వున్నారు. అందువల్ల ఇప్పటికి అయితే ఎవరికీ ఏ హర్రీ లేదు. అందువల్లే 151 సినిమాను అలా అబేయన్స్ లో వుంచినట్లు వుంచేసారని తెలుస్తోంది.