చిరు 152లో డబుల్ రోల్?

మెగాస్టార్ చిరంజీవి-ఏస్ డైరక్టర్ కొరటాల శివ కాంబినేషన్ సినిమా మరో నెలా రెండునెలల్లో ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాకు నక్సలిజం బ్యాక్ డ్రాప్ అని ఇప్పటికే గ్యాసిప్ లు వచ్చాయి. అది నిజమో కాదో…

మెగాస్టార్ చిరంజీవి-ఏస్ డైరక్టర్ కొరటాల శివ కాంబినేషన్ సినిమా మరో నెలా రెండునెలల్లో ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాకు నక్సలిజం బ్యాక్ డ్రాప్ అని ఇప్పటికే గ్యాసిప్ లు వచ్చాయి. అది నిజమో కాదో తెలియాల్సి వుంది. అయితే మరో కొత్త గ్యాసిప్ ఏమిటంటే, ఈ సినిమాలో మెగాస్టార్ డబుల్ రోల్ చేయబోతున్నారు అన్నది.

ఇది మెగాస్టార్ 152వ సినిమా. సైరా లాంటి అతి భారీ సినిమా తరువాత చేస్తున్నది. పైగా కొరటాల శివలాంటి డైరక్టర్. అంటే కచ్చితంగా ఏదో ప్రత్యేకత వుండే వుంటుంది. లేకపోతే ఇన్నాళ్లుగా ఈ సినిమా వెయిటింగ్ లో వుండదు. చిరు డబుల్ రోల్ అన్నది ఆ ప్రత్యేకత అని తెలుస్తోంది.

చిరంజీవి 150వ సినిమాలో డబుల్ రోల్ నే చేసారు. శంకర్, కత్తి శీనుగా ఆయన కనిపించారు. ఇప్పుడు మళ్లీ 152లో కూడా డబుల్ రోల్ అని వినిపిస్తోంది. అయితే ఇటు దర్శకుడి వైపు నుంచో, అటు యూనిట్ వైపు నుంచో క్లారిటీ రావాల్సివుంది.

బాబుతో పాటు అతనూ వైసిపిని ఢీకొనే ప్రయత్నం చేసేవాడేమో!