సినిమా నుంచి తప్పించినా.. పేమెంట్ ఇచ్చారట!

కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు రావడంతో బాలీవుడ్ లో కొంతమంది కెరీర్ లు ఇబ్బందుల్లో పడ్డ సంగతి తెలిసిందే. వారిలో బాలీవుడ్ స్టార్ కేరెక్టర్ ఆర్టిస్ట్ నానా పటేకర్ ఒకరు. అలాగే అక్కడి ప్రముఖ దర్శకుడు…

కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు రావడంతో బాలీవుడ్ లో కొంతమంది కెరీర్ లు ఇబ్బందుల్లో పడ్డ సంగతి తెలిసిందే. వారిలో బాలీవుడ్ స్టార్ కేరెక్టర్ ఆర్టిస్ట్ నానా పటేకర్ ఒకరు. అలాగే అక్కడి ప్రముఖ దర్శకుడు సాజిద్ ఖాన్ ను కూడా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ముప్పుతిప్పలు పెట్టాయి.

వారిపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన హీరోయిన్లు ఇప్పుడు అతీగతీ లేరు, వారిపై వచ్చిన ఆరోపణలు పోలిస్ స్టేషన్లో నిలబడలేదు. నానా  పటేకర్ పై తనూశ్రీ చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని ఇప్పటికే ముంబై పోలీసులు తేల్చి చెప్పారు. అయితే ఆమె చేసిన ఆరోపణలతో ఆయనపై మరక అయితే పడింది.

అలాగే సాజిద్ ఖాన్ పరిస్థితి కూడా అంతే. వీరిద్దరూ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. అదే సమయంలో వీరిద్దరి చేతి నుంచి ఒకే సినిమా చేజారింది. అదే 'హౌస్ ఫుల్ 4'. ఆ సినిమా ప్రారంభం దశలో వీరిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ సినిమాలో ప్రధాన పాత్ర  పోషిస్తున్నఅక్షయ్ కుమార్ వారితో చేయననే ప్రకటన చేశాడు. దీంతో వారిని తప్పించారు నిర్మాతలు.

అయితే అలా తప్పించినా వారికి ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ మాత్రం యథాతథంగా ఇచ్చేశారట. ముందుగా కుదుర్చుకున్న డీల్ ప్రకారం డబ్బులు పే చేశారట. వారి స్థానంలో ప్రత్యామ్నాయంగా వేరే వాళ్లను తీసుకున్నారు.

ఇలా బాలీవుడ్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన కామెడీ సినిమాగా 'హౌస్  ఫుల్ 4' దీపావళి సమయంలో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, రితీశ్ దేశ్ ముఖ్, బాబీడియోల్, పూజా హెగ్డే, కృతీ సనన్, బొమన్ ఇరాన్, నవాజుద్దీన్ సిద్ధికీ తో సహా రానా దగ్గుబాటి తదితరులు నటిస్తున్నారు.

బాబుతో పాటు అతనూ వైసిపిని ఢీకొనే ప్రయత్నం చేసేవాడేమో!