జగన్ కంటే నేనే గొప్ప.. పవన్ కామెడీ

జనసైనికులతో వరుస మీటింగ్ లు పెడుతూ రోజూ కామెడీ చేస్తున్నారు పవన్ కల్యాణ్. మీటింగుల్లో పవన్ మాట్లాడుతున్న మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ కి గురవుతున్నాయి. పొలిటికల్ కంటెంట్ తక్కువ, ప్రవచనాలు ఎక్కువయ్యాయంటూ…

జనసైనికులతో వరుస మీటింగ్ లు పెడుతూ రోజూ కామెడీ చేస్తున్నారు పవన్ కల్యాణ్. మీటింగుల్లో పవన్ మాట్లాడుతున్న మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ కి గురవుతున్నాయి. పొలిటికల్ కంటెంట్ తక్కువ, ప్రవచనాలు ఎక్కువయ్యాయంటూ సెటైర్లు పడుతున్నాయి. అయినా పవన్ తగ్గడంలేదు. లోకేష్ కంటే దిగజారి మాట్లాడుతూ సోషల్ మీడియాలో టార్గెట్ అవుతున్నారు.

వైఎస్ జగన్ కేవలం కేసులుండటం వల్లే పాదయాత్ర చేశారంటున్న పవన్… మోదీ కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ పాదయాత్ర చేశారా? వాళ్లపై కేసులు లేవు కాబట్టే వాళ్లు పాదయాత్ర చేయలేదంటూ చెత్త లాజిక్ చెప్పి నవ్వులపాలయ్యారు. ఇక ఫినిషింగ్ టచ్ ఏంటంటే పవన్ కూడా పాదయాత్ర చేసి ఉండేవారట. కానీ సెక్యూరిటీ ప్రాబ్లమ్ తో ఆయన వెనకడుగేశారట.

“జనంలోకి వెళ్తే నన్ను బతకనిస్తారా, నా వీరాభిమానులు నా మీద పడిపోరూ..? నా చెయ్యి ఒకరు లాగేస్తారు, కాలు ఇంకోరు లాగేస్తారు, నన్ను తాకాలని పదే పదే మీదపడతారు, నన్ను పీస్ పీస్ చేసేస్తారు. అభిమానుల్ని కంట్రోల్ చేయడం సెక్యూరిటీకి తలకుమించిన పని. అందుకే నేను పాదయాత్ర చేయలేదు”. అంటూ లేనిపోని బిల్డప్ ఇచ్చారు పవన్ కల్యాణ్.

రెండుచోట్ల పోటీచేసి దారుణంగా ఓడిపోయిన పవన్ ఎక్కడ. రాష్ట్రంలోనే రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచిన జగన్ ఎక్కడ. కనీసం పవన్ స్పృహ ఉండే మాట్లాడుతున్నారా అని నెటిజన్లు ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. ఇప్పటికీ ఇంకా వాస్తవాలు తెలుసుకోకుండా ఊహాలోకంలో బతికే పవన్, ఇక ఎప్పటికీ ప్రాక్టికల్ పొలిటీషియన్ కాలేడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

పాదయాత్ర చేయడం చేతకాక పవన్ ఇలా అర్థంలేని వాదనలు తెరపైకి తెస్తున్నారని విమర్శిస్తున్నారు. తన బలహీనతలేంటో పవన్ కు తెలియకపోవచ్చు, కనీసం ఎదుటివారి బలాన్నయినా ఓ అంచనా వేయాలి కదా? ఈ రెండూ అంచనా వేయని పవన్, పాతికేళ్ల ప్రస్థానం అంటూ జనసైనికులతో కాలక్షేపం చేస్తున్నారు. ఇలాంటి చెత్త డైలాగులతో తను సినిమాలు చేయని లోటును ఇలా స్టేజీపై భర్తీ చేసుకుంటున్నారు.

ప్రజాసంకల్ప యాత్ర పేరిట జగన్ చేసిన పాదయాత్ర ఓ చరిత్ర. మండుటెండలు, వానల్ని సైతం లెక్కచేయకుండా వేల కిలోమీటర్లు నడిచి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు జగన్. పవన్ కే కాదు, దేశంలో మరే నేతకు ఈ మహా పాదయాత్రను విమర్శించే హక్కులేదు.

బాబుతో పాటు అతనూ వైసిపిని ఢీకొనే ప్రయత్నం చేసేవాడేమో!