చిరంజీవి ఫామ్ లో లేరు, 150 వ సినిమా చేస్తున్నది లేదు. కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం రెండు వర్గాలుగా చీలి కొట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. స్వామినాయుడు అంటే చిరంజీవి ఫ్యాన్స్ అందరికీ పరిచయమే. చిరు అతడిని తీసుకుచవ్చి, తన బ్లడ్ బ్యాంక్ ఉద్యోగిని కూడా చేసారు.
ఇప్పుడు చిరంజీవి 60వ పుట్టిన రోజు హడావుడి అంతా స్వామినాయుడుదే. అయితే స్వామినాయుడు ఒంటెద్దు పోకడలు పోతున్నారని, అభిమానాన్ని క్యాష్ చేసుకుంటున్నారని ధ్వజమెత్తుతోంది ఇటీవల ప్రారంభమైన ఓ ఛానెల్. ఈ ఛానెల్ సిఇఓ గా పని చేస్తున్న వ్యక్తికి, స్వామినాయుడుకు పాత గోడవలు వున్నట్లు వినికిడి.
గతంలో ఆ వ్యక్తి కూడా అదే బ్లడ్ బ్యాంక్ లో పని చేసి, స్వామినాయుడితో విబేధించి బయటకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అలా వెళ్లి ఇప్పడు చానెల్ సిఇఓ గా సెటిల్ అయ్యాడు. దాంతో ఆ చానెల్ లో నిత్యం స్వామినాయుడు వ్యవహారాలపై డిస్కషన్లే. ఎవడి చానెల్ వాడిది..ఎవడి గోల వాడిది.