మొత్తానికి ఓ పెద్ద సినిమా, అదీ మాంచి హిట్ సినిమా చేయాలన్న మధుర శ్రీధర్ కోరిక నెరవేరేలాగే వుంది. తనికెళ్ల భరణి తయారు చేసిన, లేడీస్ టైలర్ సీక్వెల్ అయిన ఫ్యాషన్ డిజైనర్ స్క్రిప్ట్ హక్కులను ఆయన నిర్మాత అమ్మిరాజు నుంచి రెండు రోజుల క్రితం తీసుకున్నాడు.
ఇప్పుడు ఈ సినిమాను సీనియర్ దర్శకుడు వంశీతో, కొత్త సంచలనం రాజ్ తరుణ్ తో చేసే ప్రయత్నాలు షురూ చేసాడు. కథ వినలేదు కానీ, సినిమా చేస్తానని పక్కాగా మాట ఇచ్చాడట రాజ్ తరుణ్. ప్రస్తుతం మైసూరు దగ్గరలో షూటింగ్ లో బిజీ గా వున్నరాజ్ తరుణ్ అక్కడి నుంచి సినిమా చూపిస్తా మావా టూర్ కు వెళతాడు.
రాగానే కథ వినేసి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే ప్రాజెక్టు పట్టాలెక్కేస్తుంది. తనికెళ్ల స్క్రిప్ట్ కు ఒకసారి ఓకె అయిపోతే, యంగ్ టాలెంటెడ్ రైటర్ల చేత మంచి ఫన్నీ డైలాగులు రాయించి, సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నారట వంశీ.