మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు కథ దొరకడం లేదు. అయినావాళ్లని, కానివాళ్లని అందరినీ విచారించారు. చెప్పినవాళ్లు లైన్లు, కథలు చెప్పారు. కానీ ఏదీ ఒకె కావడం లేదు. అతగాడే కన్ ఫర్మ్ అనుకున్న దర్శకుడు వివి వినాయక్ , ఆకుల శివ కలిసి చెప్పిన లైన్ లు కూడా నచ్చలేదు. లైన్ దొరికి వుంటే ఈ పాటికి సినిమా సెట్ లపైకి వెళ్లిపోయి వుండేది. కానీ అలా జరగలేదు. దీనంతటికీ కారణం చిరంజీవే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.
ఆయన తన ఏజ్ కు సరిపోవడం సంగతి అలా వుంచి మాంచి ఎంటర్ టైన్ మెంట్ సినిమా కావాలంటున్నారట. మెసేజ్ అన్నది వున్న లేకపోయినా ఫరవాలేదంటున్నారట. చిరంజీవి ఏజ్ తో చూసుకుంటే మళ్లీ అందరివాడులో గోవిందరాజులు టైపు క్యారెక్టర్ చేయాల్సిందే. కానీ అలా ఆయనకు ఇష్టం లేదట. ఇంక ఎలాంటి కథ చెప్పి కన్విన్స్ చేయాలో కథకులకు, దర్శకులకు అర్థం కావడం లేదట.
ఎమోషనల్ డ్రామా కు ఓకె అంటే టప టపా, అరడజను లైన్లు చెప్పేసేవారు. కానీ అవి అస్సలు వద్దంటున్నారని వినికిడి. దాంతో ఇక చాలా మంది ఆయనకు లైన్ లు, కథలు చెప్పే ఆలోచనలు వదులుకుంటున్నారని వినికిడి.