అతను మగాడా? కాదా?

  Advertisement సెక్సానందగా వార్తల్లోకెక్కిన నిత్యానందస్వామికి విచిత్రమైన అనుభవం ఎదురయ్యింది. అతనికి ‘లైంగిక పటుత్వ’ పరీక్షలు జరుగుతున్నాయి. అది కూడా న్యాయస్థానం ఆదేశాల మేరకు కావడం గమనార్హం. నిత్యానంద తన ఆశ్రమంలో లైంగిక దాడులకు…

 

సెక్సానందగా వార్తల్లోకెక్కిన నిత్యానందస్వామికి విచిత్రమైన అనుభవం ఎదురయ్యింది. అతనికి ‘లైంగిక పటుత్వ’ పరీక్షలు జరుగుతున్నాయి. అది కూడా న్యాయస్థానం ఆదేశాల మేరకు కావడం గమనార్హం. నిత్యానంద తన ఆశ్రమంలో లైంగిక దాడులకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తిన విషయం విదితమే. సినీ నటి రంజితతో కలిసి నిత్యానంద రాజలీలల్లో మునిగి తేలిన వీడియో అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఆ వివాదానికి సంబంధించే నిత్యానందకు లైంగిక పరీక్షలు జరుగుతున్నాయి.

‘నేనసలు మగాడ్నే కాను.. నాలో లైంగిక పటుత్వం లేదు.. నేనెలా లైంగిక దాడులకు పాల్పడతాను..’ అంటూ నిత్యానంద వింత వాదన చేయడంతో అతన్ని అరెస్టు చేసిన పోలీసులకు మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. ఈ నేపథ్యంలోనే అతనికి లైంగిక పరీక్షలు జరపాలని పోలీసులు వాదించగా, ‘అది నా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం.. నా గౌరవానికి భంగం..’ అంటూ నిత్యానంద న్యాయస్థానం ఎదుట తన వాదనలు విన్పించాడు. కానీ నిత్యానంద పప్పులుడకలేదు.

నిత్యానందకు పురుషత్వ నిర్ధారణ పరీక్షలు (లైంగిక పటుత్వ పరీక్షలే..) బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో వైద్యులు నిర్వహించారు. పరీక్షల వివరాల్ని వారు న్యాయస్థానానికి వెల్లడిస్తారట. అంటే, నిత్యానంద సంసారానికి పనికొస్తాడా.? అతనికి లైంగిక సామర్థ్యం వుందా.? అసలు అతను మగాడా? కాదా? అన్న విషయాలు న్యాయస్థానికి వైద్యులు వివరిస్తారన్నమాట. చూద్దాం.. నిత్యానంద ‘పురుషత్వ పరీక్షల్లో’ ఏం తేలుతుందో.!